Hijab: కర్ణాటక హిజాబ్ నిషేధం పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..?

కర్ణాటకలో నెలకొన్న హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం అందరికీ తెలిసిందే. కాగా ఈ వివాదంలో

  • Written By:
  • Publish Date - October 13, 2022 / 03:51 PM IST

కర్ణాటకలో నెలకొన్న హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం అందరికీ తెలిసిందే. కాగా ఈ వివాదంలో నేడు మరొక కీలక పరిమాణం చోటు చేసుకుంది. ఇక ఈ వాదంపై కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు నేడు వెల్లడించింది. ఈ వివాదం పై సుప్రీంకోర్టు విచారణను జరిపింది. దీనిపై ఇద్దరు జడ్జీలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. కర్ణాటక హైకోర్టు తీర్పును జస్టిస్ హేమంత్ గుప్తా సమర్థించగా జస్టిస్ దిలీప్ మాత్రం తిరస్కరించారు.

అలా ఇద్దరు జడ్జీలు కూడా వేరువేరు తీర్పును ఇవ్వడం జరిగింది. త్రిసభ్య ధర్మసనానికి లేదంటే రాజ్యాంగ ధర్మసనానికి కేసును బదిలీ చేయడం పై ప్రధాన న్యాయమూర్తిదే నిర్ణయం తెలిపారు. దీనితో హిజాబ్ కేసు పై సిజెఐ కొత్త బెంచ్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ హిజాబ్ కేసు ఏంటి అన్న వివరాలకు వస్తే.. కర్ణాటకలోని కొందరు ముస్లిం బాలికలు హిజాబ్ ను ధరించి కాలేజీకి వచ్చారు. వారి హిజాబ్ దరించిన కారణంగా వారిని తరగతి గదులలోకి అనుమతి ఇవ్వలేదు.

దీంతో వారు ఆందోళనకు దిగారు. ఇదే విషయంపై కాలేజీల్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఫిబ్రవరి 5వ తేదీన ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత ఈ హిజాబ్ వివాదం మరింత ముదిరింది. దీంతో దేశవ్యాప్తంగా పలు ప్రదేశాలలో నిరసనలు హోరెత్తాయి. ఇదే విషయంపై కొందరు విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు మార్చు 15 సంవత్సరాల తీర్పును వెల్లడించింది. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదు అని స్పష్టం చేసింది. కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. తాజాగా హిజాబ్ వివాదంపై ద్విసభ్య ధర్మసనం ఎటు తేల్చలేక పోయింది.