WFI Sexual Harassment: ఢిల్లీ పోలీసులకు సుప్రీం కోర్టు నోటీసులు జరీ చేసింది. లైంగిక వేధింపుల కేసులో బీజేపీ ఎంపీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయనందుకు సుప్రీం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. బాధితుల సమస్యలను భేఖాతర్ చేస్తూ, ఫిర్యాదుని పట్టించుకోకపోవడంతో వివరణ ఇవ్వాల్సిందిగా సుప్రీం ఆదేశించింది. ఈ క్రమంలో బాధితులకు సంబంధించి శుక్రవారం రోజున విచారణ జరపనుంది సుప్రీం కోర్టు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై రెజ్లర్లు లైంగిక ఆరోపణలు చేస్తున్నారు. ఈ మేరకు తమకు న్యాయం చేయాల్సిందిగా ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు. అయితే తమ ఫిర్యాదుపై పోలీసులు యాక్షన్ తీసుకోకపోవడంతో గత రెండ్రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయనందుకు ఏడుగురు రెజ్లర్ల బృందం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మహిళ రెజ్లర్ వినేష్ ఫోగట్, సహచర రెజ్లర్లతో కలిసి సుప్రీం కోర్టులో ఫిల్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం రోజున విచారణ చేపట్టనున్నట్టు తెలిపింది.
కాగా మే 7న రెజ్లింగ్ అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిపై లైంగిక ఆరోపణలు రావడం చర్చనీయాంశమైంది. అయితే ప్రస్తుతం రెజ్లర్లు చేస్తున్న ఆరోపణలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదంతా రాజకీయ లబ్ది కోసమేనంటూ ఆరోపిస్తున్నారు కొందరు. అయితే మా ఆందోళనని రాజకీయంతో ముడిపెట్టవద్దంటూ కోరుతున్నారు రెజ్లర్లు.
Read More: Pawan Kalyan: జనసేన సైనికులకు పవన్ కళ్యాన్ దిశానిర్దేశం