Supreme Court: తెలుగు అకాడ‌మీకి సుప్రీం రిలీఫ్‌

విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం తెలుగు అకాడ‌మీకి తెలంగాణ ఇవ్వాల్సిన రూ. 92.94 కోట్ల‌ను వారం రోజుల్లో చెల్లించాల‌ని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.

  • Written By:
  • Updated On - April 29, 2022 / 10:33 PM IST

విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం తెలుగు అకాడ‌మీకి తెలంగాణ ఇవ్వాల్సిన రూ. 92.94 కోట్ల‌ను వారం రోజుల్లో చెల్లించాల‌ని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. వ‌డ్డీ 6శాతం లెక్కించి మొత్తం చెల్లించాల‌ని ఆర్డ‌ర్ ఇచ్చింది. తెలుగు అకాడమీ విభజన అంశంపై తెలంగాణ రాష్ట్రానికి శుక్రవారం సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వారం రోజుల్లోగా వడ్డీతో సహా బకాయిలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
తెలుగు అకాడమీ విభజన అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు తెలంగాణకు అనుమతించిన న్యాయస్థానం రూ. 92. 94 కోట్ల బకాయిని వారంలోపే 6 శాతం వడ్డీతో ఏపీకి చెల్లించాలని కోర్టు పేర్కొంది. తెలుగు అకాడమీకి సంబంధించి 2021 జనవరిలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేసేందుకు నెల రోజుల సమయం ఇచ్చింది. ఆస్తులు, నిధుల పంపకంపై హైకోర్టు ఉత్తర్వులు అమలులో ఉంటాయని సుప్రీంకోర్టు పేర్కొంది.