Site icon HashtagU Telugu

Vote Note Case : ఓటకు నోట్‌ కేసు..సీఎం రేవంత్‌ రెడ్డికి ఊరట

Supreme Court Dismissed The

Supreme Court dismissed the Vote Note Case

Vote Note Case: ఓటుకు నోట్‌ కేసులో సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy)కి భారీ ఊరట లభించింది. ఓటుకు నోట్ కేసు డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. ఇవాళ జరిగిన ఓటుకు నోట్ కేసు పిటిషన్ ను డిస్మిస్ చేసిన సుప్రీం కోర్టు కీలక ప్రకటన చేసింది. వాస్తవంగా బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి పిటిషన్ పై ఈరోజు సుప్రీం కోర్టు విచారణ జరిపింది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ కేసు విచారణ తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి పిటిషన్ వేశారు. ఇక పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ బీఆర్ గవై నేతృత్వంలోని ధర్మాసనం..కీలక ప్రకటన చేసింది. ఓటుకు నోట్ కేసు డిస్మిస్ చేసింది. దీంతో సీఎం రేవంత్‌ రెడ్డికి ఓటుకు నోట్ కేసులో బిగ్‌ రిలీఫ్‌ దక్కింది. కాగా, జగదీశ్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు.

కాగా, రేవంత్‌రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌ అఫిడవిట్‌ను కూడా మార్చారని అన్నారు. కేసును భోపాల్‌కు తరలించాలని ఆయన కోరారు. వాదనలు విన్న జస్టిస్ గవాయ్ ధర్మాసనం ఈ అంచనాల ఆధారంగా కేసు విచారణను మార్చలేమని, దానిని మార్చడం న్యాయ వ్యవస్థపై విశ్వాసం లేదని పరోక్షంగా సూచిస్తుందని పేర్కొంది. న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, కేసు విచారణకు ప్రత్యేక ప్రాసిక్యూటర్‌ను నియమించాలని నిర్ణయించినట్లు ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు ధర్మాసనం జగదీశ్‌రెడ్డి పిటిషన్‌ను కొట్టివేసింది.

Read Also: Hydra : ‘హైడ్రా’ పేరుతో వసూళ్లకు పాల్పడేవారిపై ఫోకస్ పెట్టండి – సీఎం రేవంత్