Site icon HashtagU Telugu

Chandrababu : టీడీపీ అధినేత చంద్ర‌బాబుని క‌లిసిన న‌టుడు ర‌జ‌నీకాంత్‌

TDP

TDP

టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడిని న‌టుడు ర‌జ‌నీకాంత్ ఆయ‌న నివాసంలో క‌లిశారు. తన నివాసానికి వచ్చిన ర‌జ‌నీకాంత్‌కి చంద్రబాబు సాదర స్వాగతం పలికారు. ఇద్దరూ కలిసి చాలాసేపు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. ఇద్దరు పరస్పరం యోగక్షేమాలు తెలుసుకోవటంతో పాటు.. తాజా రాజ‌కీయ అంశాల మీద చర్చించారు. ర‌జ‌నీకాంత్ నటిస్తోన్న కొత్త సినిమాల గురించి చంద్ర‌బాబు అడిగి తెలుసుకున్నారు. ప్రియమైన స్నేహితున్ని ఇలా కలుసుకోవటం చాలా ఆనందంగా ఉందని బాబు తెలిపారు. సూపర్ స్టార్ రజనీకాంత్‌ను కలిసిన విషయాన్ని బాబు తన అధికారిన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.