తెలుగు చిత్ర పరిశ్రమ మరో దిగ్గజ నటుడిని కోల్పోయింది. టాలీవుడ్ జెమ్స్ బాండ్ సూపర్ స్టార్ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. దీంతో ఘట్టమనేని కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన అభిమానులు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.
అనారోగ్య సమస్యలతో 80ఏళ్ల వయస్సుల్లో ఆయన తుదిశ్వాస విడియారు. సోమవారం గుండెపోటుతో హైదరాబాద్ లోని కాంటినేటన్ ఆసుపత్రిలో చేరారు. శరీరంలోని ప్రధాన అవయవాలు దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపారు. వైద్యులు ప్రయత్నించినప్పటికీ ఆయన కోలుకోలేదు. 48 గంటలు గడిస్తే కానీ చెప్పలేమన్నారు. అంతలోనే సూపర్ స్టార్ కన్నుమూశారు. భార్య, పెద్ద కుమారుడు మరణంతో తీవ్రంగా క్రుంగిపోయిన ఆయన అనారోగ్యం పాలయ్యారు. ఈ క్రమంలోనే ఆరోగ్యం పూర్తిగా క్షీణిచింది. సూపర్ స్టార్ మరణ వార్తతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది.