Site icon HashtagU Telugu

AP : రాజమండ్రి జైలు సూపరింటెండెంట్‌ సెలవుతో..టీడీపీ శ్రేణుల్లో అందోళన మరింత పెరిగింది

Superintendent Of Rajahmundry Jail Who Went On Leave

Superintendent Of Rajahmundry Jail Who Went On Leave

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు ను అరెస్ట్ (Chandrababu Arrest) చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ( Rajahmundry Jail ) ఉన్నాడు. చంద్రబాబు ను జైల్లో పెట్టిన దగ్గరి నుండి చంద్రబాబు కు ప్రాణ హాని ఉందనే అందోళన టీడీపీ శ్రేణుల్లో నెలకొంది. ఇదే విషయాన్నీ లాయర్లు సైతం ఏసీబీ కోర్ట్ కు విన్నవించారు. జైల్లో చంద్రబాబు కు రక్షణ లేదని , ఆయన్ను హౌస్ రిమాండ్ కు ఆదేశాలు ఇవ్వాలని కోరినప్పటికీ ఏసీబీ కోర్ట్ లాయర్ల పిటిషన్ ను తోసిపుచ్చింది.

ఇక ఇప్పుడు రాజమండ్రి జైలు సూపరింటెండెంట్‌ వ్యక్తిగత కారణాలతోనే సెలవు (Superintendent Of Rajahmundry Jail Who Went On Leave) పెట్టి వెళ్లడం..టీడీపీ శ్రేణుల్లో మరింత అందోళన పెంచుతుంది. జైలు సూపరింటెండెంట్ రాహుల్ శుక్రవారం నుంచి సెలవులు తీసుకుంటున్నారు. రాహుల్ భార్య అనారోగ్యంతో బాధపడుతుందని అందుకే జైలు సూపరింటెండెంట్‌ సెలవులు పెట్టినట్లు రాజమండ్రి జైలు అధికారులు వెల్లడించారు. చంద్రబాబు లాంటి హై ప్రొఫైల్ కలిగి ఉన్న వ్యక్తి జైలులో రిమాండ్‌లో ఉండటంతో జైలు బాధ్యతలను మరొకరికి అప్పగిచడం ఫై అందరిలో అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. రాహుల్ మళ్లీ జైలు సూపరింటెండెంట్‌గా విధుల్లోకి వచ్చేవరకు కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్‌కు రాజమండ్రి సెంట్రల్ జైలు ఇంఛార్జ్ బాధ్యతలను అప్పగించారు.

Read Also : AP : టీడీపీ – జనసేన పొత్తు ఫై వైసీపీ నేతల రియాక్షన్ ఎలా ఉందంటే..

ఇక ఈరోజు చంద్రబాబు ను పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కలవడం..బయటకు రాగానే పొత్తులపై క్లారిటీ ఇవ్వడం చకచకా జరిగిపోయింది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ తో కలిసి జనసేన పోటీ చేయబోతోందని..జగన్ ను గద్దె దించడం ఖాయం అన్నట్లు ధీమా వ్యక్తం చేసారు. ఇలా వరుస సంఘటనలతో టీడీపీ శ్రేణుల్లో అనేక అనుమానాలు వస్తున్నాయి. ఈ పొత్తు..రాబోయే ఎన్నికలు..పార్టీ ఓటమి చెందితే ఎలా అనే అనుమానాలతో వైసీపీ చంద్రబాబు ను ఏమైనా చేస్తుందా..? ఇప్పటీకే ప్రాణ హాని అంటున్నారు..ఇప్పుడు జరగరానిది ఏమైనా జరుగుతుందా..? అంటూ వారంతా భయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికి చంద్రబాబు జైల్లో ఉండగా..జైలు సూపరింటెండెంట్‌ సెలవు తీసుకోవడం చర్చ గా మారింది.