Super Typhoon Rai: ఫిలిప్పీన్స్‌లో తుఫాన్‌.. 70మందికిపైగా మృతి

ఫిలిప్ఫీన్‌లో తుపాన్‌ దాటికి సుమారు 75 మంది మరణించారు. ఈ సంవత్సరం ఫిలిప్ఫీన్స్‌ తాకిన బలమైన తుపాను 'రాయ్'. అల్లకల్లోలమైన ద్వీపంలోని ప్రజలకు నీరు, ఆహారాన్ని అందించేందుకు ముమ్మురంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

  • Written By:
  • Updated On - December 19, 2021 / 10:14 AM IST

ఫిలిప్ఫీన్‌లో తుపాన్‌ దాటికి సుమారు 75 మంది మరణించారు. ఈ సంవత్సరం ఫిలిప్ఫీన్స్‌ తాకిన బలమైన తుపాను ‘రాయ్’. అల్లకల్లోలమైన ద్వీపంలోని ప్రజలకు నీరు, ఆహారాన్ని అందించేందుకు ముమ్మురంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. అనేక మంది నిరాశ్రయులయ్యారు. ద్వీపంలోని దక్షిణ, మధ్య ప్రాంతాలపై ఈ తుపాను విరుచుకుపడటంతో విద్యుత్‌, కమ్యూనికేషన్‌ వ్యవస్థలపై తీవ్ర ప్రభావితమైంది. గ్రామాలన్నీ నీట మునిగాయి. సుమారు 3 లక్షల మందికి పైగా ప్రజలు ఇళ్లను, రిసార్ట్‌లను ఖాళీ చేశారు. గంటకు 195 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులతో కూడిన సూపర్‌ తుపాన్‌ గురువారం ద్వీపంపై విరుచుకుపడింది. పలువురు గల్లంతు కాగా, సమారు 15 మంది గాయపడినట్లు సమాచారం. సహాయక చర్యల్లో భాగంగా ఆర్మీ, పోలీసు, కోస్ట్‌గార్డ్‌, అగ్ని మాపక సిబ్బంది భారీగా చేరుకున్నారు.