Site icon HashtagU Telugu

Sunrisers Hyderabad: సన్ రైజర్స్ జోరు కొనసాగుతుందా ?

Sunrisers

Sunrisers

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఇవాళ మరో రసవత్తర పోరు జరుగనుంది. బ్రబోర్న్ మైదానం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ , కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు పోటీపడనున్నాయి. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో మూడింట్లో గెలిచిన కేకేఆర్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండు స్థానంలో ఉండగా…మరోవైపు ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచుల్లో రెండింట్లో గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పాయింట్లపట్టికలో 8వ స్థానంలో ఉంది. ఈ మెగా టోర్నీలో రెండు జట్లు మొత్తం 21మ్యాచ్‌ల్లో తలపడగా కేకేఆర్ 14 మ్యాచుల్లో, సన్ రైజర్స్ 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి.

ఇక ఈ మ్యాచ్ లో కేన్ విలియమ్సన్ సారథ్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టుని పరిశీలిస్తే.. అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్, ఓపెనర్లుగా రానుండగా.. మూడో స్థానంలో రాహుల్ త్రిపాఠి మిడిల్ ఆర్డర్ లోఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, లోయర్ ఆర్డర్ లో శశాంక్ సింగ్, జగదీశ సుచిత్, బ్యాటింగ్ కు రానున్నారు.. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ విషయానికొస్తే..భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ దుమ్మురేపేందుకు సిద్ధంగా ఉన్నారు..

అలాగే ఈ మ్యాచ్ లోశ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ తుది జట్టుని పరిశీలిస్తే.. అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్, ఓపెనర్లుగా రానుండగా.. మూడో స్థానంలో శ్రేయాస్ అయ్యర్ మిడిల్ ఆర్డర్ లో సామ్ బిల్లింగ్స్ , నితీష్ రానా, లోయర్ ఆర్డర్ లో ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్ బ్యాటింగ్ కు రానున్నారు.. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు బౌలింగ్ విభాగం విషయానికొస్తే..పాట్ కమిన్స్, ఉమేష్ యాదవ్, రసిఖ్ సలామ్, వరుణ్ చక్రవర్తి అదరగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.అలాగే ఈ మ్యాచ్ జరగనున్న బ్రబౌర్న్ స్డేయం పిచ్ బ్యాటింగ్ కు ఎక్కువగా అనుకూలిస్తుంది. ఈ పిచ్ పై ఈసారి ఐపీఎల్ లో అత్యధిక స్కోర్లు నమోదయ్యాయి. అయితే, కొత్త బంతితో పేసర్లు స్వింగ్ రాబట్టొచ్చు. మంచు కూడా ముఖ్య పాత్ర పోషించే ఛాన్స్ ఉంది ఈ క్రమంలో టాస్ గెలిచిన జట్లు తొలుత బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.