Site icon HashtagU Telugu

Hyderabad: వార్నర్ ను అభినందిస్తూ సన్ రైజర్స్ ట్వీట్

Template (87) Copy

Template (87) Copy

ఆస్ట్రేలియా ఆటగాడు, మాజీ సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ గత ఐపీఎల్ సీజన్ లో పేలవ ఆటతీరుకు తోడు నాయకత్వ వైఫల్యాలతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో స్థానం కోల్పోవడం తెలిసిందే. టోర్నీ మధ్యలో అవమానకర పరిస్థితుల్లో వార్నర్ ను తప్పించారంటూ అప్పట్లో వ్యాఖ్యలు కూడా వినిపించాయి.

అయితే, ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్ పై మూడో టెస్టులో నెగ్గి యాషెస్ ను నిలబెట్టుకున్న నేపథ్యంలో సన్ రైజర్స్ యాజమాన్యం వార్నర్ ను ఉద్దేశించి ట్వీట్ చేయడం ఆశ్చర్యం కలిగించింది. యాషెస్ విజయం పట్ల శుభాభినందనలు డేవీ. చూస్తుంటే నువ్వు మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్టుంది. ఐపీఎల్ ఆక్షన్ లో నీకు మంచి అవకాశం రావాలని కోరుకుంటున్నాం అంటూ ట్వీట్ చేశారు.