Site icon HashtagU Telugu

Summer Season: తెలుగు రాష్ట్రాల్లో మొద‌లైన స‌మ్మ‌ర్ హీట్‌..!

Summer

Summer

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. పగిటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వేసవి కాలం మొద‌లైంది. సహజంగా మార్చిమొద‌టి వారం నుంచి వేసవి కాలంగా పరిగణిస్తారు. అయితే ఈ ఏడాది కాస్త ముందుగానే వేసవికాలం ప్రారంభమైన‌ట్టు కనిపిస్తోంది. మొన్నటివరకు దాదాపు 28 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఉండగా, ఆదివారం నాడు ఒక్కసారిగా 34.4 డిగ్రీల సెల్సియస్​కు పెరిగింది.

ఇక సోమ‌వారం ఏపీలోని తిరుపతిలో 37.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక అనంతపురం, కర్నూలు వంటి పట్టణాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 36.6 డిగ్రీలకు చేరాయి. కడపలో 36.2, తూర్పుగోదావరి జిల్లా తునిలో 36.1, ప్రకాశం జిల్లా ఒంగోలులో 35.7, అమరావతిలో 35.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలో పలుచోట్ల ఉదయం 9 గంటలకే ఎండలు మండిపోతున్నాయి. గత ఏడాది ఫిబ్రవరి నెలలో పగటి ఉష్ణోగ్రతలు కొంచెం తక్కువగానే ఉన్నాయి.

మరోవైపు తెలంగాణలో పలుచోట్ల గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీలకు చేరింది. ఒక్క‌ హైదరాబాద్‌లోనే 34 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యింది. తెలంగాణలో రాత్రిపూట చ‌లి మాత్రం త‌గ్గ‌లేదు కానీ, పగటి ఉష్ణోగ్రలు పెరుగుతున్నాయి.ఖమ్మం, నిర్మల్‌లో ఆదివారం 37.2 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లో 10 డిగ్రీలు, నిర్మల్‌లో 12.3 డిగ్రీలు, సంగారెడ్డిలో 13.5 డిగ్రీలు, నిజామాబాద్‌లో 13.5 డిగ్రీలు, రంగారెడ్డిలో 13.8 డిగ్రీలు, జగిత్యాలలో 14.3 డిగ్రీలు, మెదక్‌లో 15 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోద‌య్యాయి. దీంతో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మార్చి తొలి వారంలోనే ఎండలు మండేలా కనిపిస్తున్నాయి.