Site icon HashtagU Telugu

Summer: సమ్మర్ ఎఫెక్ట్..  సిటీలో పెరుగుతున్న విద్యుత్ వాడకం

Electrocution

The Silhouette Of The High Voltage Power Lines During Sunset.

Summer: హైదరాబాద్ లో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ఇంట్లో ఫ్యాన్లు, కూలర్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలకు ఏమాత్రం విశ్రాంతి ఉండడం లేదు. ముఖ్యంగా తెలంగాణ పరిధిలోని హైదరాబాదులో మార్చి, ఏప్రిల్ నెలలో డిమాండ్ తారాస్థాయికి చేరింది. పలు సబ్ స్టేషన్లలో 80% కంటే ఎక్కువ లోడ్ ఉన్న పవర్ ట్రాన్స్ ఫార్మర్లను ఎక్కువ సామర్థ్యం ఉన్న వాటితో మార్పు చేశారు. అంతేకాదు పలు కాలనీలో ఉండే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లను అధికారులు మార్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యుత్ వినియోగం అధికంగా ఉండే సమయంలో డీటీఆర్ ల ఖచ్చితమైన లోడ్ గుర్తించే మదింపు చేపడుతున్నారు. టంగ్ టెస్టర్ ద్వారా లోడ్ గుర్తించి విద్యుత్ సిబ్బంది రికార్డ్ చేస్తున్నారు.

అయితే ఈ పనిని వారు రాత్రిపూట చేపడుతున్నారు..విద్యుత్ గరిష్ట డిమాండ్ సాధారణంగా సాయంత్రం సమయంలో ఉంటుంది. ఈ ఏడాది విద్యుత్ వినియోగం తీరు పూర్తిగా మారిపోయింది. ఒక్కో సర్కిల్లో ఒక్కో సమయంలో ఒక్కో తీరుగా నమోదు అవుతున్నది. ఐటీ కార్యాలయాలు, బహుళ అంతస్తులు ఉన్న సైబర్ సిటీ ప్రాంతాల్లో ఏప్రిల్ 5న రికార్డు స్థాయిలో 784.4 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదయింది. గత ఏడాది ఏప్రిల్ 20వ తేదీన గరిష్టంగా నమోదైన 455 మెగావాట్ల కంటే ఇది చాలా ఎక్కువ. నార్సింగి, గచ్చిబౌలి ప్రాంతాలలో పీటీఆర్ సామర్ధ్యాన్ని పెంచినప్పటికీ డిమాండ్ అధికంగానే నమోదవుతున్నది.

Exit mobile version