Site icon HashtagU Telugu

Sukanya Samriddhi: సుకన్య సమృద్ధి ఖాతా దారులకు శుభవార్త…!!

sukanya samriddhi

sukanya samriddhi

ప్రభుత్వ పథకాలలో డబ్బులు ఇన్వెస్ట్ చేసే వారికి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వడ్డీ రేట్లలో ప్రభుత్వం త్వరలోనే మార్పు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే సేవింగ్ స్కీమ్స్ లో పెట్టుబడి పెట్టేవారికి చాలా ప్రయోజనం చేకూరుతుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా ప్రభుత్వ పొదుపు పథకాలపై వడ్డీ రేటు ప్రస్తుత రేటు కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆర్బీఐ రెపోరేటును పెంచిన తర్వాత పలు బ్యాంకులు ఎఫ్ డీ, ఆర్ డీ వడ్డీ రేటును పెంచుతున్నాయి. ఈ మేదరకు ప్రభుత్వ పథకాలపై కూడా ఈ ప్రభావం పడింది. వడ్డీ రేట్లను పెంచనున్నారు.

అయితే స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ రేట్లు వచ్చే నెల 30 నుంచి మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఇవి వర్తిస్తాయి. ఈ సారి ప్రభుత్వం నుంచి పొదుపు పథకాలపై వడ్డీ రేటు పెరుగుతుందని అంతా భావిస్తున్నారు. చాలాకాలంగా చిన్న పొదుపు పథకాలపై వడ్డీరేటులో ఎటువంటి మార్పు లేదు. ఈ పరిస్థితిలో ద్రవ్యోల్బణం దృష్ట్యా వాటిపై వడ్డీని పెంచే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది.
ఇక ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు భవిష్యత్తులో రెపోరేటను కూడా పెంచవచ్చని RBIగవర్నర్ కొన్నిరోజుల క్రితం సూచించారు. వడ్డీ రేటు పెంపుతో PPF,సుకన్య సమృద్ధి యోజనపై రాబడులు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ పై ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి వడ్డీని సమీక్షిస్తుంది. ఈ సమీక్ష సమయంలో వడ్డీ రేటును పెంచాలా, తగ్గించాలా లేదా స్థిరంగా ఉంచాలా అనే నిర్ణయం తీసుకోనున్నారు. అయితే వీటిని ఆర్థిక మంత్రిత్వ శాఖ దీన్ని నిర్ణయిస్తుంది. కాగా సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెట్టే వారికి 7.6% వార్షిక రాబడి వస్తుంది. అదేవిధంగా మీరు నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ల ఖాతా గురించి మాట్లాడినట్లయితే అది 5.8% రాబడిని అందుతుంది. ఇక కిసాన్ వికాస్ పత్రపై వడ్డీ రేటు 6.9 శాతంగా ఉంది.

Exit mobile version