Low BP : లోబీపీతో బాధపడుతున్నారా.. ఈ జాగ్రత్తలతో సమస్యకు చెక్ పెట్టేయండి..!!

మనం ఎక్కువ మందిలో హైబీపీ సమస్యను చూస్తాం. కానీ లోబీపీ సమస్యతో బాధపడేవారు కూడా చాలానే ఉంటారు. ఇలాంటి వారు ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం కూడా ఉంది.

  • Written By:
  • Updated On - June 11, 2022 / 09:55 AM IST

మనం ఎక్కువ మందిలో హైబీపీ సమస్యను చూస్తాం. కానీ లోబీపీ సమస్యతో బాధపడేవారు కూడా చాలానే ఉంటారు. ఇలాంటి వారు ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం కూడా ఉంది. మారుతున్న జీవనశైలి కారణంలో ఎన్నో రోగాలు సాధారణం అయ్యాయి. అందులో హైబీపీ, లోబీపీ. అయితే చాలా మంది హైబీపీ సమస్యనే సీరియస్ గా తీసుకుంటుంటారు. నిజానికి హైబీపీ ఎంతో డేంజరో ఇప్పుడు తెలసుకుందాం.

లోబీపీ వల్ల వచ్చే సమస్యలు..
లోబీపీ వల్ల వచ్చే సమస్యల్లో ముఖ్యంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. గందరగోళమైన ఆలోచనలు వస్తుంటాయి. నిరాశతో ఉంటారు. ఎప్పుడూ తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. గాయం చిన్నదైనా…రక్తం ఎక్కువగా కారుతుంది. అంతేకాదు వీళ్లు వాతావరణం మారిపోగానే…అనారోగ్యం బారిన పడుతుంటారు. కళ్లు తిరిగి పడిపోతుంటారు. లోబీపీ సమస్య ఉన్నవారు గుండెకు సంబంధించిన వ్యాధులు, గుండెపోటు, వంటి ప్రాణాంతక సమస్యలు చుట్టుకునే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

తీసుకోవల్సిన జాగ్రత్తలు…
ఈ సమస్య ఉన్నవారు నీళ్లు ఎక్కువగా తాగాలి. రోజుకు కనీసం ఏడు నుంచి ఎనిమిది గ్లాసుల మంచినీళ్లు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు బీపీ తక్కువ ఉందని ఉప్పును ఎక్కువగా తింటుంటారు. కానీ అలా తినడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఉప్పు ఎన్నో ప్రమాదకరమైన వ్యాధులకు కారణం అవుతుంది. ఇక లోబీపీతో బాధపడేవారు…ఫొలిక్ యాసిడ్, ఐరన్, విటమిన్ బి12 పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. కొబ్బరి నీళ్లు కూడా ఎంతో సహాయపడతాయి. ఒకే సారి తినకుండా…కొదికొద్దిగా తింటుండాలి. ఇలా చేస్తే బీపీ నార్మల్ కు వచ్చే ఛాన్స్ ఉంటుంది.

నిద్రలేకున్నా….
నిద్ర తక్కువపోయినా…బీపీ తగ్గుతుందట. అందుకే నిద్ర తక్కువ కాకుండా చూసుకోవాలి. హైబీపీ ఉన్నవారే కాదు..లోబీపీ ఉన్నవారు కూడా పండ్లరసాలు తీసుకోవాలి. బీట్ రూట్, దానిమ్మ వంటి జ్యూసులు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

ఇవే కాకుండా టామోటోలు, క్యాబేటీ, పాప్ కార్న్, చికెన్, చీజ్ , గుడ్లు, కీరదోస, ముల్లంగి, క్యాప్సికం, పొద్దుతిరుగుడు గింజలు, క్యారెట్లు, బ్రోకలి, ముల్లంగి ఎక్కువగా తీసుకోవాలి. బీపీని పెంచేందుకు సహాయపడతాయి. ముఖ్యంగా బీపీ తగ్గినప్పుడు కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాల పదార్థాలను తీసుకుంటే…దాని నుంచి త్వరగా బయటపడతారు.