ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ఒక కీలక ప్రకటన చేశారు. జూన్ 12 తర్వాత రాష్ట్రంలో ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీలు ప్రారంభించనున్నట్లు ఆయన అధికారులను హెచ్చరించారు. ప్రభుత్వ పథకాల అమలు, ప్రజలకు అందుతున్న సేవల నాణ్యతపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు శాఖల పనితీరు, ప్రజలకు వారి సేవల ప్రాధాన్యతపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు.
Bad Breath: ఏమి చేసిన నోటి దుర్వాసన పోవడం లేదా.. అయితే వెంటనే ఇలా చేయండి!
చంద్రబాబు తెలిపిన దాని ప్రకారం.. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి సుమారు సంవత్సరం పూర్తి అవుతున్న నేపథ్యంలో అన్ని శాఖల్లో మెరుగైన పనితీరు కనబడాలని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ సేవలు అందాలనే ఉద్దేశంతో ఈ తనిఖీలు చేపట్టనున్నట్లు స్పష్టంచేశారు. ముఖ్యంగా పౌరసరఫరాలు, ఆరోగ్యం, విద్య, పంచాయతీరాజ్ వంటి కీలక విభాగాలపై సీఎం దృష్టి పెట్టారు.
RTC వంటి కొన్ని శాఖల్లో సేవల నాణ్యతలో మరింత మెరుగుదల అవసరమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తుందన్న నమ్మకాన్ని బలపరచేందుకు అధికార యంత్రాంగం మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. ఈ ఆకస్మిక తనిఖీలు ప్రభుత్వ పనితీరును మానిటర్ చేయడంలో ముఖ్యపాత్ర వహించనున్నాయి. అధికారులు, సిబ్బంది ప్రజలకు గుణాత్మక సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం అన్నారు.