గానకోకికల లతా మంగేష్కర్ దివికెగింది. తన జీవితకాలమంతా స్వరాలకే పరిమితమైంది. లతజీ మరణం పట్ల ప్రతిఒక్కరూ సంతాపం ప్రకటిస్తున్నారు. ఇవాళ రాజ్యసభ నివాళులు అర్పించింది. లతజీపై గౌరవంతో ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ నివాళి అర్పించారు. ఒడిశాలోని పూరీ తీరంలో ఆమె సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. లతా మంగేష్కర్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Sudarsan Pattnaik Tribute: పూరీ తీరంలో లతజీ సైకత శిల్పం

Lata