Site icon HashtagU Telugu

ACB Raids : మ‌ల్కాజ్‌గిరి స‌బ్ రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ దాడులు

Crime

Crime

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో గ్రేడ్ వన్ సబ్ రిజిస్ట్రార్‌పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆదాయానికి మించిన ఆస్తుల కేసును నమోదు చేసింది. సబ్ రిజిస్ట్రార్ చిల్లకరాజు పళని కుమారి ఇల్లు, ఆమె కార్యాలయంతో పాటు ఆమె సన్నిహితుల ఇళ్లలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు కోట్ల రూపాయ‌ల విలువ గ‌ల ఆస్తుల‌ను గుర్తించారు. ఆమె విధుల్లో ఉన్న సమయంలో చట్టవిరుద్ధమైన పద్ధతులు ద్వారా ఈమె ఆస్తులు సంపాదించారనే సమాచారంతో సోదాలు నిర్వహించామ‌ని ఏసీబీ అధికారులు తెలిపారు. పళని కుమారిని అరెస్టు చేసి హైదరాబాద్‌లోని ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల మొదటి అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.

Exit mobile version