Site icon HashtagU Telugu

AP News: ఏపీ ఉద్యోగ సంఘాలతో సబ్ క్యాబినెట్ భేటీ, కీలక విషయాలపై చర్చ

AP employees

AP employees

బకాయిలు చెల్లించాలని వినతి పత్రం ఇచ్చిన రాష్ట్ర సచివాలయ ఉద్యోగులపై మంత్రి బొత్స చిరాకు పడ్డారు. ఏపీ జేఏసీ ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యేందుకు సచివాలయానికి వచ్చిన మంత్రిని ఉద్యోగులు చుట్టుముట్టారు. సమస్యలను మంత్రికి తెలిపారు. ఎన్నికల కోడ్ రాకముందే బకాయిలు చెల్లించాలని కోరిన ఉద్యోగులపై బొత్స అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్కు, బకాయిలు విడుదలకు సంబంధం ఎంటని ప్రశ్నించారు. మరోసారి వచ్చి కలవాలని కోరారు.

కాగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో శుక్రవారం మంత్రుల కమిటీ చర్చలు చేపట్టింది. 16 ఉద్యోగ సంఘాలతో మంత్రి బొత్స, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ జవహర్రెడ్డి సమావేశమయ్యారు. పీఆర్సీ బకాయిలు, పెండింగ్ డీఏలపై ఈ భేటీలో చర్చించారు. డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల 27న చలో విజయవాడకు ఏపీ ఐకాస పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ అత్యవసరంగా భేటీ అయింది. ఉద్యోగులకు మధ్యంతర భృతి చెల్లించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.