Site icon HashtagU Telugu

Students War : భీమ‌వ‌రంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌

Students Imresizer

Students Imresizer

భీమవరం ఎస్‌ఆర్‌కెఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల హాస్టల్‌లో విద్యార్థుల మధ్య జరిగింది. ఈ ఘర్షణలో ఓ విద్యార్థిపై తోటి విద్యార్థులు కర్రలతో దాడి చేసి తీవ్రంగా కొట్టిన వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతుంది. అంకిత్ అనే విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడి చేశారు. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి త‌న‌ను కొట్టొందంటూ వేడుకున్నప్పటికీ వారు కర్రలతో కొట్టడం కొనసాగించినట్లు వీడియోలో క‌నిపిస్తుంది. ఈ క్రమంలో అంకిత్‌కు తీవ్రగాయాలు కావడంతో భీమవరం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందింది. నలుగురు విద్యార్థులపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.