Site icon HashtagU Telugu

Odisha Train Accident: మృతిదేహాలు ఉంచిన పాఠశాల కూల్చివేసేందుకు నిర్ణయం

Odisha Train Accident

New Web Story Copy 2023 06 08t165009.477

Odisha Train Accident: గత శుక్రవారం సాయంత్రం బాలాసోర్ జిల్లాలోని బహంగా రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 288 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. రెస్క్యూ టీమ్ శిథిలాల నుంచి క్షతగాత్రులను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను సమీపంలోని ఉన్నత పాఠశాలలో ఉంచారు. ఇప్పుడు అదే పాఠశాలకు తమ చిన్నారులను పంపేందుకు తల్లిదండ్రులు వెనకాడుతున్నారు. సదరు పాఠశాలలో కుప్పలు తెప్పలుగా మృతిదేహాలు ఉంచడంతో భయం, ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో ఓ డిమాండ్ వినిపిస్తుంది.

ఒడిశా ప్రమాదంలో మరణించిన మృతిదేహాలను భద్రపరిచిన పాఠశాలను కూల్చివేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలాసోర్ జిల్లా మేజిస్ట్రేట్ దత్తాత్రేయ భౌసాహెబ్ హైస్కూల్ యాజమాన్యం అనుమతి పొందినట్లయితే ఉన్నత పాఠశాలను కూల్చివేయవచ్చని అంటున్నారు సంబంధిత అధికారులు. ప్రస్తుతం వందలాది మంది విద్యార్థులు చదువుతున్న ఈ ఉన్నత పాఠశాల బహంగాలో 65 ఏళ్ల క్రితం నిర్మించడం గమనార్హం. ప్రస్తుతం వేసవి సెలవుల కారణంగా ఈ పాఠశాల మూసివేయబడింది.

ఇటీవలి రైలు ప్రమాదం తరువాత, చనిపోయిన అనేక మంది ప్రయాణికుల మృతదేహాలను ఈ ఉన్నత పాఠశాలకు తీసుకువచ్చారు. దీంతో ఈ ప్రమాదంలో ప్రయాణికులు అకాల మృతి చెందడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తెలియని భయం నెలకొంది. దీనిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అటువంటి పరిస్థితిలో కౌమారదశలో ఉన్న విద్యార్థులపై దాని చెడు ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు హైస్కూల్ కూల్చివేతపై కూడా చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు జూన్ 18 న పాఠశాలను తెరవనున్నారు.

Read More: World Deepest Hotel: వృద్ధురాలిని మోసం చేసిన నకిలీ డాక్టర్.. మత్తుమందు ఇచ్చి ఆపై అలా?