Site icon HashtagU Telugu

Tamilnadu: తమిళనాడులో అద్భుతం.. హైడ్రోజన్ ఫ్యూయల్ బోటును రూపొందించిన విద్యార్థులు?

Hydrogen Fuel Boat

Hydrogen Fuel Boat

తాజాగా తమిళనాడుకి చెందిన పదిమంది విద్యార్థులు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ పవర్డ్ బోటును తయారు చేశారు. గ్లోబల్ పోటీలో పోటీ చేయడానికి విద్యార్థులు ఈ బోట్ ని రూపొందించారు. మొనాకాలో ఎనర్జీ బోట్ ఛాలెంజ్ లో పాల్గొనడం కోసం తమిళనాడులోని ఒక ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ఒక పది మంది విద్యార్థుల బృందం కలిసి ఈ బోట్ ను తయారు చేశారు. హైడ్రోజన్ ఇందన సెల్ ఆధారితపడవల ప్రపంచ రేసులో పాల్గొనబోతున్నారు.

మత్స్యకారుల కోసం పడవలో వాణిజ్యపరంగా తీర్చిదిద్దాలని విద్యార్థులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మొనాకాలో ఎనర్జీ బోట్ చాలెంజ్ యాచింగ్ పరిశ్రమతో కలిసి గ్రీన్ ఇన్నోవేషన్ ని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమంను నిర్వహించనున్నారు. సముద్ర రంగంలో ఈ మొబిలిటీని ప్రోత్సహించడానికి జీరో ఎమిషన్ ప్రొపల్సన్, సుస్థిరతను నొక్కి చెప్పే బోట్లను నిర్మించడంలో విద్యార్థులు పరిశోధకులకు సహాయం చేయడానికి ప్రతిష్టాత్మక యాచ్ క్లబ్ డి మొనాకోచే ఈ కార్యక్రమం నిర్వహించబడింది. బృందం తమ ఎనర్జీ బోటును హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్, కష్టం డిజైన్ చేసిన స్వదేశీ ప్రొపల్షన్ సిస్టం తో పవర్ చేయాలని నిర్ణయించుకుంది.

జూలైలో జరగనున్న మొనాకాలో ఎనర్జీ బోట్ చాలెంజ్ 10వ ఎడిషన్ లో పాల్గొనడానికి జట్టు అర్హత సాధించిందని బోటు పైలెట్ స్వామినాథం తెలిపారు. పోటీ అంటే సముద్ర ప్రయాణంలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడం. పోటీలో మూడు తరగతులు ఉన్నాయి. ఇక్కడ మేము శక్తి తరగతిలో పాల్గొంటాము. మేము పడవ కోసం మా సొంత శక్తి వ్యవస్థను అభివృద్ధి చేశాము. అలాగే మేము శక్తి వనరు ప్రొపెల్లెంట్ సిస్టమ్ తో పాటుగా మా సొంత కాక్ పిట్ మోడల్ లేకుండా ట్విన్ హల్ డిజైన్ను ఉపయోగిస్తున్నాము అని తెలిపారు.