Malaysia: టీచర్ ని పెళ్లిచేసుకున్న స్టూడెంట్.. ఎక్కడో తెలుసా?

ఉపాధ్యాయుడు అంటే విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు నేర్పించి మంచి నడవడికలు నేర్పించేవాడు అని అర్థం. విద్యార్థిని చెడు మార్గంలో కాకుండా సరైన

  • Written By:
  • Publish Date - May 14, 2023 / 07:50 PM IST

ఉపాధ్యాయుడు అంటే విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు నేర్పించి మంచి నడవడికలు నేర్పించేవాడు అని అర్థం. విద్యార్థిని చెడు మార్గంలో కాకుండా సరైన మార్గంలో నడిపించే వ్యక్తి. అటువంటి ఉపాధ్యాయులు ఈ మధ్యకాలంలో టీచర్ ఉద్యోగానికి కళంకం తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల ఒక టీచర్ తన స్టూడెంట్ కి లవ్ లెటర్ రాసింది. మొన్నటికి మొన్న ఒక ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్ లో చాలామంది ఆడపిల్లలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా నిత్యం రకరకాల ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా కూడా మరొక వింత ఘటన మలేషియాలో చోటుచేసుకుంది..

ఏకంగా ఒక టీచర్ విద్యార్థిని పెళ్లి చేసుకుంది. అయితే ఆ విద్యార్థి వయసు టీచర్ వయసు తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. టీచర్ కి 48 ఏళ్లు కాగా ఆ యువకుడికి 22 ఏళ్లు. ప్రేమించి మరి ఈ జంట పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమ కథ విషయానికి వస్తే.. మొహమ్మద్ డానియల్ అహ్మద్ అలీ వయసు 22 ఏళ్ళు. అతని క్లాస్ టీచర్ జమీలా వయసు 48 ఏళ్లు. 2016లో అతను చదువుతున్న స్కూల్ కి వెళ్ళినప్పుడు క్లాస్ రూమ్ లో ఆమెను కలిశాడు. ఆమెను చివరి సారిగా నాలుగవ తరగతిలో చూశాడు. తనను గుర్తు చేస్తూ జమీలా ను పలకరించాడు. ఆ సమయంలో ఇద్దరు ఫోన్ నెంబర్స్ మార్చుకున్నారు. దీంతో మొహమ్మద్ పుట్టినరోజు కానుకగా ఆమె ఫోన్ లో శుభాకాంక్షలు చెబుతూ మెసేజ్ చేసింది.

Malaysia

ఇక నెమ్మదిగా ఆమెపై ఇష్టాన్ని పెంచుకున్నాడు. ఆ విషయమే ఆమెకు చెప్పగా వారిద్దరి మధ్య 26 సంవత్సరాల భేదం ఉండడంతో జమీలా మొదట రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత మొహమ్మద్ ఆమె ఇంటి అడ్రస్ కనుక్కొని ఆమెతో నెమ్మదిగా మాటలు కలిపాడు. వారిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఎట్టకేలకు మొహమ్మద్ ప్రేమను ఆమె అంగీకరించింది. 2019లోనే వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుందామని అనుకున్నప్పటికీ కరోనా మహమ్మారి వల్ల వాయిదా పడింది. 2021 లో ఫ్రెండ్స్ మధ్యలో సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు. కాగా జమీలకు 2007లోనే మొదటి భర్తతో విడాకులు అయ్యాయి. ఇదేం పోయేకాలం అంటూ వారిని తిట్టిపోస్తున్నారు.