Site icon HashtagU Telugu

Swine Flu In NIT Warangal : వరంగల్ ఎన్ ఐటీలో స్వైన్ ఫ్లూ క‌ల‌క‌లం.. ఓ విద్యార్థికి పాజిటివ్

Swine Flu

Swine Flu Imresizer

వరంగల్ ఎన్ ఐటీలో ఓ విద్యార్థికి స్వైన్‌ ఫ్లూ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. విద్యార్థికి జ్వరం రావడంతో వెంటనే హన్మకొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా శుక్రవారం రాత్రి హెచ్‌1ఎన్‌1 పరీక్ష నిర్వహించారు. ప్రస్తుతం విద్యార్థిఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. హాస్టల్ ఆవరణలో.. తరగతి గదులలో శానిటైజేషన్ జరిగిందని ఎన్ ఐటీ ప్ర‌క‌టించింది. ఈ విద్యార్థితో సన్నిహితంగా ఉన్న విద్యార్థులను కనీసం ఒక వారం పాటు ఐసోలేషన్‌లో ఉండాలని NIT యాజమాన్యం కోరింది. ఇన్‌స్టిట్యూట్ క్యాంపస్‌లో వ్యాధి వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ విష‌యాన్ని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు సమాచారం అందించారు