Site icon HashtagU Telugu

Suicide: మ‌హిళ‌ల‌ను వేధించేది టీడీపీ నాయ‌కులే – మంత్రి వెల్లంప‌ల్లి

Whatsapp Image 2022 01 30 At 21.58.55 Imresizer

Whatsapp Image 2022 01 30 At 21.58.55 Imresizer

విజయవాడలో విద్యార్థిని ఆత్మ‌హ‌త్య రాజ‌కీయ రంగు పులుముకుంది. ఆత్మ‌హ‌త్య‌కు టీడీపీ నాయ‌కుడు వినోద్ కుమార్ జైన్ కార‌ణ‌మంటూ బాలిక సూసైడ్ నోట్ లో రాయడంతో టీడీపీ నుంచి వినోద్ కుమార్ జైన్ ని స‌స్పెండ్ చేసింది.అయితే విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో స్థానిక మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాసరావు ఆధ్వ‌ర్యంలో వైసీపీ నేత‌లు క్యాండిల్ ర్యాలీ నిర్వ‌హించారు. ర్యాలీ లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసిపి నేతలు పాల్గోన్నారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

చ‌నిపోయిన బాలిక ఎడ్యుకేషన్ లో టాపర్ గా ఉంద‌ని.. గత రెండున్నర నెలలుగా బాలికను నిందితుడు లైంగికంగా ఇబ్బంది పెడుతున్నారని మంత్రి వెల్లంప‌ల్లి అన్నారు. సూసైడ్ నోట్ లో పాప అన్ని అంశాలు చెప్పిందని.. అవి వింటుంటే త‌న‌కే బాధ అనిపించిందన్నారు. మహిళలపై అరాచకాలు జరిగేది టీడీపీ వాళ్ల వ‌ల్ల‌నేన‌ని.. లోకేష్ పిఎ టిడిపి మహిళా నేతల ను ఏడిపిస్తిన్నారని వాళ్లే ధర్నా చేశారని మంత్రి ఆరోపించారు. పాతబస్తీలో నిందితుడు వినోద్ జైన్ కార్పొరేటర్ అభ్యర్దిగా పోటీ చేశార‌ని.. వినోద్ జైన్‌కోసం చంద్రబాబు ప్రచారం చేశారని ఆయ‌న తెలిపారు. బాలిక మృతిపై చంద్రబాబు, లోకేష్ సమాధానం చెప్పాలని ..చంద్రబాబు కు మహిళల పట్ల మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. రేపటి మహిళా మీటింగ్ లో పాపకు న్యాయం జరిగే‌ విధంగా చంద్రబాబు ను మహిళలు నిలదీయాలని ఆయ‌న డిమాండ్ చేశారు.

Exit mobile version