Child Birth: నెలసరి నొప్పులు అనుకుని బాత్రూంకి వెళ్తే.. బిడ్డతో బయటకొచ్చిన యువతి?

తాజాగా యునైటెడ్ కింగ్ డమ్ లోని ఒక యూనివర్సిటీలో చదువుతున్న ఒక 20 ఏళ్ల యువతికి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆమెకు ఎక్కువగా కడుపు నొప్పి వస్తుండటంతో నెలసరి నొప్పి అనుకుంది.

  • Written By:
  • Publish Date - June 29, 2022 / 09:45 AM IST

తాజాగా యునైటెడ్ కింగ్ డమ్ లోని ఒక యూనివర్సిటీలో చదువుతున్న ఒక 20 ఏళ్ల యువతికి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆమెకు ఎక్కువగా కడుపు నొప్పి వస్తుండటంతో నెలసరి నొప్పి అనుకుంది. ఆ కడుపు నొప్పి మరింత ఎక్కువగా నొప్పిస్తుండడంతో ఆమె బాత్రూం కి వెళ్ళగా అక్కడే ప్రసవం అయిపోయిందట. అయితే ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమిటంటే ఆ యువతికి ప్రెగ్నెన్సీ కి సంబంధించిన ఎటువంటి లక్షణాలు లేవు. అంతే కాకుండా బేబీ పంపు కూడా లేదట.

ఆమె బిడ్డ ప్రసవం అయ్యే వరకూ తాను గర్భవతిని అన్న అనుమానం కూడా ఆమెకు రాలేదట. కానీ అకస్మాత్తుగా డెలివరీ అయ్యే అప్పటికీ ఆమె షాక్ అయిందట. యూకే లోని సౌతాంప్టన్ యూనివర్సిటీలో చదువుతున్న జెస్ డేవిస్ అనే యువతి 20 ఏళ్ల వయసులో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమెకు ఎప్పుడూ కూడా తాను గర్భవతి అన్న విషయం కూడా తెలియదని, అటువంటి లక్షణాలు కూడా తనలో కనిపించలేదని, ఒకవేళ గర్భవతి అయితే బేబీ బంప్ ఉండాలి కదా అలా బేబీ పంపు కూడా లేదని తెలిపింది. అయితే ఆమెకు పీరియడ్స్ ఎప్పుడు తరచుగా రాకపోవడంతో ఆమె ఆ విషయాన్ని ఎక్కువగా గుర్తించలేదట.

అప్పుడప్పుడు ఆమెకు వికారంగా వాంతులు వచ్చినట్లు అనిపించడంతో అప్పుడు మందులు వాడటం లాంటివి చేశాను అని తెలిపింది. కానీ కడుపు నొప్పి వచ్చినప్పుడు బాత్రూంకి వెళ్లి బాత్రూం లో బిడ్డను చూసినప్పుడు మొదట ఆమె కల అని అనుకుందట. తన జీవితంలో అంతకంటే పెద్ద షాక్ మరొకటి లేదు అని ఆమె తెలిపింది. అయితే ఒకరోజు అర్ధరాత్రి దాటిన తర్వాత ఆమెకు కడుపు నొప్పి మరింత తీవ్రం కావడంతో పీరియడ్స్ మొదలవుతున్నాయి అనుకొని బాత్రూం కి వెళ్ళిందట. కడుపు నొప్పి మరింత తీవ్రం కావడంతో ఆమె తన పొట్టను కిందకు పుష్ చేసిందట. అప్పటికి కూడా ఆమెకు అనుమానం రాలేదట. కానీ కొద్దిసేపటి తర్వాత బిడ్డ ఏడుపు వినిపించడంతో ఏం జరిగిందో తెలియక ఒక్క సారిగా షాక్ అయిందట. ఆ తర్వాత వెంటనే ఆమె తన స్నేహితులకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో, తన స్నేహితురాలు సహాయంతో హాస్పిటల్ కి వెళ్ళాను అని ఆమె తెలిపింది. ఇక హాస్పిటల్ లో తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు.