Site icon HashtagU Telugu

Khammam : ఖమ్మంలో విషాదం.. క‌రెంట్ షాక్ త‌గిలి విద్యార్థి మృతి

Suicide

Deadbody Imresizer

ఖమ్మం జిల్లా కూసుమంచిలో విషాదం నెల‌కొంది. మండలంలోని పాఠశాలలో ఫ్లెక్స్‌ బోర్డు ఏర్పాటు చేస్తుండగా విద్యుదాఘాతంతో 18 ఏళ్ల విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన జవహర్ నవోదయ విద్యాలయ (జెఎన్‌వి) పాఠశాలలో జరిగింది. మృతుడు దుర్గా నాగేంద్ర, మరో ముగ్గురు విద్యార్థులతో కలిసి రాబోయే క్రీడా దినోత్సవం కోసం ఫ్లెక్స్ బోర్డును ఏర్పాటు చేస్తుండగా లైవ్ వైర్ తగిలింది. నాగేంద్ర అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం జిల్లా సర్వజన ఆసుపత్రికి తరలించారు. విష‌యం తెలుసుకున్న నాగేంద్ర కుటుంబ సభ్యులు, కొన్ని విద్యార్థి సంఘాలు పాఠశాల ముందు ధ‌ర్నా చేశారు. ప్రిన్సిపాల్ చంద్ర బాబు నిర్లక్ష్యం కార‌ణంగానే నాగేంద్ర మ‌ర‌ణించాడ‌ని వారు ఆరోపించారు. విద్యార్థి సంఘాల ఆందోల‌న‌తో ప్రిన్సిపాల్ చంద్ర‌బాబును విధుల నుంచి సస్పెండ్ చేశారు.ఈ ఘ‌ట‌న‌పై ఖమ్మం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version