Site icon HashtagU Telugu

Horrific Incident : పరీక్షలో చీటి ఇవ్వలేదని..స్నేహితుడ్ని చితికబాదిన స్నేహితుడు

Student brutally attacks friend for not helping him cheat in exams

Student brutally attacks friend for not helping him cheat in exams

స్నేహితుడు (Friend) అంటే తాను ఓడిపోయినా తన స్నేహితుడు గెలవాలని కోరుకునే స్వచ్ఛమైన బంధమే స్నేహం. పేధ, ధనిక చూడనిది కుల, మత బేధం లేనిది బంధుత్వం కన్నా గొప్పది స్నేహం ఒక్కటే. అలాంటి స్నేహంలో కూడా కొంతమంది చెడ్డవారు ఉంటారు. స్నేహం చేస్తూనే..వారి హాని కోరుకునే వారు లేకపోలేరు. తాజాగా ఓ స్నేహితుడు..పరీక్షలో చీటి ఇవ్వలేదనే కోపం..బయటకు వచ్చాక చితకబాదిన ఘటన హైదరాబాద్ పాతబస్తీ లో చోటుచేసుకుంది.

పాతబస్తీ ఛాదర్‌ఘాట్ (Old City Chanderghat)ఏరియాలో నివాసం ఉండే కసబ్, ఆరిఫ్ (Arif and Kasab) అనే విద్యార్థులు మంచి స్నేహితులు. ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుతున్నారు. ఎస్ఐఎస్ వొకేషనల్ జూనియర్ కాలేజీలో ఆరిఫ్, కసబ్ సహ విద్యార్థులు కూడా. కాగా, ప్రస్తుతం కాలేజీలో పరీక్షలు (Exams) జరుగుతున్నాయి. ఆరిఫ్, కసబ్ ఇద్దరూ పరీక్ష రాస్తున్న సమయంలో కసబ్.. ఆరిఫ్ నుంచి చీటి అడిగాడు. అయితే, ఆరిఫ్ చీటి ఇవ్వకపోవడంతో కోపం పెంచుకున్నాడు. పరీక్ష హాలులోనే కసబ్ కోపంతో ఊగిపోయాడు. పరీక్ష అయిపోయాక నీ సంగతి చూస్తా అనుకున్నాడు.

Read Also : Mouni Roy : నల్లచీరలో నాగిని ఫేమ్ మౌని రాయ్ అందాల విందు

పరీక్షా అవ్వగానే విద్యార్థులంతా పార్కింగ్ సెల్లార్ లో కలుసుకున్నారు. ఈ క్రమంలో పరీక్ష సమయంలో తనకు చీటి అందించకపోవడంపై కసబ్.. ఆరిఫ్ ను నిలదీశాడు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. అప్పటికే కోపంతో ఊగిపోతున్న కసబ్.. ఆరిఫ్ పై దాడికి తెగబడ్డాడు. స్నేహితుడు అని కూడా చూడకుండా విచక్షణ రహితంగా కొట్టాడు. దీంతో కసబ్ దాడికి తాళలేక ఆరిఫ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తోటి విద్యార్థులు కసబ్ ను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ అతడు ఆగలేదు. రక్తపు మడుగులో ఉన్న ఆరిఫ్ ను తోటి విద్యార్థులు స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే కసబ్ తీవ్రంగా కొట్టడంతో.. ఆరిఫ్ మెదడులో రక్తం గడ్డకట్టిందని, ప్రస్తుతం ఆరిఫ్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఆరిఫ్ తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఛాదర్ ఘాట్ పోలీసులు (Chaderghat police station) దర్యాప్తు మొదలు పెట్టారు.