Site icon HashtagU Telugu

Earthquake: రష్యా తూర్పు తీరంలో భారీ భూకంపం.. ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనైన జనం?

Chile Earthquake

Chile Earthquake

తాజాగా రష్యా తూర్పు తీరంలో 6.9 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీంతో ఒక్కసారిగా రష్యా ప్రజలు ఉలిక్కిపడ్డారు. కానీ భూకంపం విషయం పై స్పందించిన రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ సునామీ సంభవించలేదని ప్రాణ రాష్ట్రం లేదని విధ్వంసం లేదు అని తెలిపింది. అత్యవసర మంత్రిత్వ శాఖ తెలిపిన ప్రకారం.. భూకంపం రష్యాలోని పసిఫిక్ తీరంలో పెట్రో పావ్లోవ్స్క్ కం చట్టాకు దక్షిణంగా 44 కిలోమీటర్ల అనగా 27 మైళ్ళు 100 కిలోమీటర్ల లోతులో ఈ భారీ భూకంపం సంభవించింది.

మాస్కోకు తూర్పున 6,800 కిలోమీటర్ల దూరంలో ఉన్న కం చట్కా దీపకల్పం నుంచి మీడియా పోస్ట్ చేసింది. పోస్ట్ చేసిన ఫుటేజీలో భూకంపం కారణంగా కూలిన సూపర్ మార్కెట్లు భవనాలకు పగుళ్లు కనిపించాయి. కానీ ముద్దగా తక్షణ నిర్మాణా నష్టం అయితే జరగలేదు. ఇక ఆ ఘటన పై రక్షణ సిబ్బంది అగ్ని మాపక సిబ్బందికి చెందిన కార్యాచరణ బంధాలు భవనాలను తనిఖీ చేస్తున్నట్లు అత్యవసర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా ప్రాథమిక సమాచారం ప్రకారం ఎటువంటి ప్రాణ నష్టం అలాగే విద్వంసం జరగలేదని తెలిసింది.

ఆ భారీ భూకంప తీవ్రత 6.9 గా నమోదు అయినట్లు రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్స్ జియోఫిజికల్ సర్వే కమ్ చట్కా బ్రాంచ్ తెలిపింది. యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ మొదట భూకంపం తీవ్రత 6.6 గా ఉన్నట్లు తెలిపింది. ఆ భారీ భూకంపం తర్వాత ఎటువంటి సునామీ హెచ్చరికలు లేవని యుఎస్ సునామీ హెచ్చరిక వ్యవస్థ తెలిపింది.