China : చైనాలో తీవ్ర భూ కంపం

భారీ భూ కంపం తాకిడికి చైనా వ‌ణికిపోయింది. ఆ దేశంలోని సిచువాన్ ప్రావిన్స్‌కు పశ్చిమాన ఉన్న పర్వత ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం తర్వాత 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది.

Published By: HashtagU Telugu Desk
Earthquake

Peru Earthquake

భారీ భూ కంపం తాకిడికి చైనా వ‌ణికిపోయింది. ఆ దేశంలోని సిచువాన్ ప్రావిన్స్‌కు పశ్చిమాన ఉన్న పర్వత ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం తర్వాత 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ మేర‌కు చైనా భూకంప నెట్‌వర్క్‌ల కేంద్రం తెలిపింది. సిచువాన్ రాజధాని చెంగ్డూకు నైరుతి దిశలో 180 కిమీ (111 మైళ్లు) దూరంలో 16 కిలోమీటర్ల లోతులో లుడింగ్ పట్టణంలో భూకంప కేంద్రం ఉన్నట్లు కేంద్రం తెలిపింది.సిచువాన్‌లో భూకంపం సంభవించినట్లు చాంగ్‌షా మరియు జియాన్‌లకు దూరంగా ఉన్న నెటిజన్లు చెప్పారు. కొన్ని నిమిషాల తర్వాత, లూడింగ్ సమీపంలోని యాన్ నగరంలో 4.2 తీవ్రతతో రెండవ భూకంపం సంభవించిందని కేంద్రం తెలిపింది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. 2013లో, యాన్‌లో బలమైన భూకంపం సంభవించింది. అప్ప‌ట్లో 100 మందికి పైగా మరణించారు. వేలాది మంది గాయపడ్డారు.

  Last Updated: 05 Sep 2022, 12:30 PM IST