Site icon HashtagU Telugu

Pakistan Earthquake: పాకిస్థాన్‌లో మ‌రోసారి భూకంపం.. ఇళ్ల నుంచి ప‌రుగులు తీసిన జ‌నం..!

Earthquake

Earthquake

Pakistan Earthquake: 2024 సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు స‌మ‌యంలో పాకిస్థాన్‌లో భూకంపం (Pakistan Earthquake) రావడంతో ప్రజలు అల్లాడిపోయారు. పాకిస్థాన్‌లో శనివారం నాడు 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. రాత్రి 11 గంటల ప్రాంతంలో పలు ప్రాంతాల్లో అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆ స‌మ‌యంలోనే భూకంపం వ‌చ్చింద‌ని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రకంపనలు విపరీతంగా రావడంతో ప్రజలు తమ పిల్లలతో సహా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అంతేకాకుండా ఓట్ల లెక్కింపు కారణంగా రాత్రి టీవీ న్యూస్ ఛానెల్ లైవ్ షో జరుగుతోంది. అందులో కూర్చున్న జర్నలిస్టులు, నిపుణుల ప్యానెల్ కూడా భూకంపం ప్రకంపనలను అనుభవించింది. దీనికి సంబంధించిన వీడియో కూడా బయటపడింది.

కొన్ని నివేదిక‌ల ప్ర‌కారం.. పెషావర్ లో కూడా భూకంపం వచ్చిందని తెలిసింది. పాకిస్తాన్ వాతావరణ శాఖ (పిఎమ్‌డి) నివేదిక ప్రకారం.. భూకంప కేంద్రం హిందూకుష్ ప్రాంతంలో భూమికి 142 కిలోమీటర్ల లోతులో ఉంది.

Also Read: Hung In Pak: పాకిస్థాన్ ఎన్నిక‌ల్లో హంగ్‌.. ఏ పార్టీకి రాని మెజారిటీ..?

ప్రజలు భయంతో కేకలు వేయడంతో గందరగోళం నెలకొంది

స్వాత్, చిత్రాల్‌లో భూకంపం చాలా బలంగా ఉందని డాన్ న్యూస్ జర్నలిస్టులకు ఓ వ్యక్తి చెప్పారు. ఇది రాత్రి సమయం, చాలా చలిగా ఉంది. బయట ఎన్నికల వాతావరణం ఉండడంతో రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించాం. అకస్మాత్తుగా వంటగదిలో పాత్రలు పడిపోయాయని చెప్పుకొచ్చారు. త‌ర్వాత భూప్ర‌కంప‌న‌లు మొద‌లైన‌ట్లు చెప్పారు. అంతేకాకుండా భూకంపం వచ్చింది.. బయటకు రండి అంటూ కొంద‌రు కేకలు వేశారు. పలు ప్రాంతాల్లో ఇళ్లు కూలిన‌ట్లు సమాచారం. గత నెలలో భూకంపం వచ్చింది. కాబూల్ నుండి ఇస్లామాబాద్ వరకు ప్రజలు, భవనాలను వణికించిన భూకంపం 6 తీవ్రతతో సంభ‌వించింది.

We’re now on WhatsApp : Click to Join