Old Things: పాత వస్తువులకు మంచి డిమాండ్ ఉంటుంది. పురాతన కాలం నాటి వస్తువులకు బాగా డిమాండ్ ఉంటుంది. పురాతన కాలం నాటి వస్తువులకు అప్పుడప్పుడు వేలం పాట వేస్తూ ఉంటారు. వేలం పాటలో ఇవి రూ.కోట్లకు అమ్ముడుపోతూ ఉంటాయి. పురాతన కాలం నాటి వస్తువులను కొనుగోలు చేసేందుకు వ్యాపారవేత్తలు ఆసక్తి చూపుతూ ఉంటారు. తాజాగా పురాతన కాలం నాటి గిన్నె, జగ్గు, పెయింటింగ్ లకు భారీ ధర పలికింది.
పురాతన కాలం నాటి పింగాణీ గిన్నె రూ.200 కోట్లు, జగ్గు రూ.110 కోట్లు, పెయింటింగ్ రూ.260 కోట్లు పలికాయి. మాములుగా మార్కెట్‌లో గిన్నెలు, జగ్గులు, పెయింటింగ్ ధర వందలు లేదా వేలల్లో ఉంటుంది. కానీ పురాతన కాలం నాటికి కావడంతో రూ.100 కోట్లకుపైగా పలికాయి. ఈ సంఘటన చైనాలో జరిగింది. సోథిబె అనే సంస్థ పురాతన వస్తువులకు వేలం పాట నిర్వహిస్తూ ఉంటుంది. ఆసియాలో ఆ సంస్థ ఆఫీస్ ప్రారంభించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల హాంకాంగ్‌లో ప్రత్యేక వేలం నిర్వహించింది.
ఈ వేలంలో మూడు శతాబ్ధాల కాలం నాటి గిన్నె, జగ్గుకు వేలం పాట జరిపారు. ఇవి చైనాకు చెందినవి కాగా.. గిన్నె రూ.200 కోట్లు, జగ్గు రూ.110 కోట్లకు అమ్ముడుపోయింది. గిన్నె 18వ శతాబ్ధానికి చెందినదిగా చెబుతున్నారు. 1722-35 మధ్య యోంగ్ జింగ్ అనే రాజు హయాంలో అరుదైన సిరామిక్స్ తో ఈ గిన్నె తయారుచేసినట్లు చెబుతున్నారు. ఇలాంటి గిన్నెలు ఉండగా.. ప్రస్తుతం ఒకటి లండన్‌లోని బ్రిటిష్ మ్యూజియంలో ఉంచారు. రెండో గిన్నెను ఇప్పుడు వేలం పాట వేశారు. అయితే వేలం పాటలో ఈ గిన్నెను ఎవరు సొంతం చేసుకున్నారనే విషయం మాత్రం బయటపెట్టలేదు. ఇక పికాసో ఆఫ్ ది ఈస్ట్‌గా గుర్తింపు పొందిన పింక్ లెటసెస్ ఆన్ గోల్డ్ స్క్రీన్ అనే పేరుతో ఉన్న పెయింటింగ్ రూ.262 కోట్లుకు అమ్ముడైంది.