Paper Leak: పేపర్ లీక్ చేస్తే కఠిన చర్యలు: మంత్రి సబితా

సోషల్ మీడియాలో వైరల్ కావడంపై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Written By:
  • Updated On - April 5, 2023 / 10:59 AM IST

రెండు రోజుల పాటు ప్రశ్నాపత్రాలు వరుసగా సోషల్ మీడియాలో వైరల్ కావడంపై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షల నిర్వహణలో అవకతవకలకు పాల్పడే వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని ఆమె హెచ్చరించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని చెప్పారు. పదో తరగతి ప్రశ్నాపత్రాలు వాట్సప్‌లో ప్రత్యక్షం కావడంతో.. పరీక్షల నిర్వహణపై ఆమె అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో బీఆర్కే భవన్‌లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ.. పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీక్ కాలేదని, ఈ విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. మిగిలిన 4 పరీక్షల నిర్వహణలో కఠిన చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు. పరీక్షల నిర్వహణలో 55 వేల మంది అధికారులు, సిబ్బంది ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. వీళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కేంద్రాల్లోకి తీసుకెళ్లకూడదని మంత్రి సబితా ఆదేశించారు.