Oral health: ఓరల్ హెల్త్ ను ఒత్తిడి,డిప్రెషన్ ఎందుకు ప్రభావితం చేస్తుంది…?

మానసిక ఒత్తిడి, మీ జీవితం, శరీరంపై హానికరమైన ప్రభావాలను కలిగిస్తుంది. ఒక వ్యక్తి ఒత్తిడికి లోనైప్పుడు లేదా డిప్రెషన్ తో బాధపడుతుంటే...

Published By: HashtagU Telugu Desk
Depression

Depression

మానసిక ఒత్తిడి, మీ జీవితం, శరీరంపై హానికరమైన ప్రభావాలను కలిగిస్తుంది. ఒక వ్యక్తి ఒత్తిడికి లోనైప్పుడు లేదా డిప్రెషన్ తో బాధపడుతుంటే…వారు బరువు పెరగడం, జుట్టు రాలడం లేదా అలసట, బలహీనత దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడటం గమనించవచ్చు. కానీ మానసిక ఆరోగ్యం సరిగ్గాలేనట్లయితే నోటి ఆరోగ్య సమస్యలకు కూడా కారణం అవుతుందన్న విషయం మీకు తెలుసా. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల లేదా ఆందోళనతో బాధపడే వ్యక్తులు ధూమపానం, మద్యపానం, ఆర్థరాత్రి అల్పాహారం అతిగా తినడం వంటివి కూడా దంత సమస్యలకు కారణం కావొచ్చు. బద్ధకం అలసట కారణంగా…వ్యక్తికి భోజనం చేయాలన్న కోరిక కలుగదు. అది పోషకాహారలోపానికి దారితీస్తుంది. ఇది ఎనామెల్ కోతకు కూడా కారణం అవుతుంది. ఎందుకంటే చక్కెరవ వంటకాలు, జంక్ ఫుడ్ కొందరు చాలా ఇష్టపడుతుంటారు. దీని పర్యవసానంగా దంతక్షయం, కావిటీస్ ఏర్పడుతాయి.

నోటి పరిశుభ్రత ఉన్నప్పటికీ డిప్రెషన్ తో బాధపడుతున్న వారికి బర్నింగ్ మౌత్ సిండ్రోమ్ ను కలిగి ఉన్నారన్న విషయాన్ని గమనించవచ్చు. పైన చెప్పిన విధంగా పోషకాహారలోపానికి కారణం కావచ్చు. మానిసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారిలో దంతాల ఆందోళన ఈరోజుల్లో సర్వసాధారణం అయ్యింది. ఆందోళన రుగ్మతలు మిమ్మల్ని డెంటల్ డాక్టర్ ను సందర్శించకుండా ఆపవచ్చు. అందుకే నోటి సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. డిప్రెషన్, ఆందోళన కూడా నొప్పికి మరింత సున్నితంగా ఉండటానికి కారణం అవుతుంది. ఇది సెన్సివిటికీ దారి తీస్తుంది. మానసిక ఆరోగ్య రోగులకు ఇచ్చే యాంటీ డిప్రెసెంట్ మందులు పొడి నోరు వంటి అసంఖ్యాక దుష్ప్రభావాలకు కారణం అవుతాయి. పొడిబారిన నోరు చిగుళ్ల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది.

ధూమపానం, మద్యపానం, డ్రగ్స్, నిరాశ, ఒత్తిడి, ఆందోళనను ఎదుర్కొవటానికి అనారోగ్యకరమైన మార్గాలు ఇవి. ఆల్కాహాల్ చిగుళ్ల వ్యాధికి కారణం అవుతుంది. ధూమపానం, డ్రగ్స్ తారు పేరుకుపోయేలా చేస్తాయి. అంతేకాదు ఇది నోటి క్యాన్సర్ కు దారి తీయవచ్చు.

నివారణ చర్యలు.
*ఎనామిల్, కావిటీస్ కోతకు కారణమయ్యే జంక్, షుగర్ ఫుడ్స్ ను తినడం మానుకోవాలి.
*చిగుళ్ల వ్యాధి, నోటి క్యాన్సర్ కు కారణమయ్యే ధూమపానం, మద్యపానం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి.
*రోజుక రెండు సార్లు మీ దంతాలను బ్రష్ చేయాలి. మౌత్ వాష్ ఉపయోగించడం ఇంకా మంచిది.
*మీ దంతాల మధ్య ఫలకం పేరుకుపోకుండా చూసుకోవాలి.
*పౌష్టికాహారం తినాలి.
*డెంటిస్టును క్రమం తప్పకుండా సంప్రదించండి.

  Last Updated: 08 Mar 2022, 02:39 PM IST