Stray Dogs: స్కూటీ మీద వెళ్తున్న మహిళను వెంటాడిన వీధికుక్కలు, ముగ్గురికి తీవ్రగాయాలు

ఈ మధ్య కుక్కల బెడద (stray dogs) ఎక్కువైంది. మొన్న హైదరాబాద్ లో వీధికుక్కలు బాలుడిని చంపిన ఘటన తెలిసిందే. తాజాగా ఒడిశాలో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. బెర్హంపూర్ నగరంలో స్కూటీపై వెళ్తున్న మహిళను వెంబడించాయి. కుక్కలు వేగంగా దూసుకురావడంతో భయపడిన మహిళ స్కూటీ రైడర్ బ్యాలెన్స్ కోల్పోయింది. వేగంగా వచ్చిన స్కూటీ రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన్నారితో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డయింది. #WATCH […]

Published By: HashtagU Telugu Desk
Viral Video

Viral Video

ఈ మధ్య కుక్కల బెడద (stray dogs) ఎక్కువైంది. మొన్న హైదరాబాద్ లో వీధికుక్కలు బాలుడిని చంపిన ఘటన తెలిసిందే. తాజాగా ఒడిశాలో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. బెర్హంపూర్ నగరంలో స్కూటీపై వెళ్తున్న మహిళను వెంబడించాయి. కుక్కలు వేగంగా దూసుకురావడంతో భయపడిన మహిళ స్కూటీ రైడర్ బ్యాలెన్స్ కోల్పోయింది. వేగంగా వచ్చిన స్కూటీ రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన్నారితో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డయింది.

ఈ ప్రమాదంలో చిన్నారితో పాటు మహిళలిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డుపై ఇతర వాహనాలేవీ కదలకపోవడంతో వీడియో నిర్మానుష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. మహిళ స్కూటీని అతివేగంతో నడుపుతుండగా, ఐదు కుక్కలు వెనుక నుంచి పరిగెత్తడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు పడిపోతున్న మహిళలు, చిన్నారులను చూసి కుక్కలు అక్కడి నుంచి పారిపోయాయి.

  Last Updated: 04 Apr 2023, 09:45 AM IST