Site icon HashtagU Telugu

Delhi : ఢిల్లీలో వీధికుక్క‌ల స్వైర విహారం.. ఇద్ద‌రు చిన్నారుల‌పై దాడి

Govt Bans Dogs

Dogs

ఢిల్లీలోని రంగపురి ప్రాంతంలో ఓ మహిళ, ఇద్దరు చిన్నారులపై వీధికుక్కలు దాడి చేశాయి. మహిళ మార్నింగ్ వాక్ కోసం బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుక్కల గుంపు ఆమెపై ఒక్కసారిగా దాడి చేసింది. ఆమె కాలు, చేతికి గాయాలయ్యాయి. సాయంత్రం వాష్‌రూమ్‌కు వెళ్లిన చిన్నారులపై అదే కుక్కల గుంపు దాడి చేసింది. ఈ వారం ప్రారంభంలో.. అదే ప్రాంతంలో ఏడేళ్ల బాలికను వీధికుక్క చంపింది. బాలిక మెడ, చేతులను తీవ్రంగా కుక్కులు గాయ‌ప‌రిచాయి.

ఇటీవల చోటుచేసుకున్న ఘటనలతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించి ప్రజలకు భద్రత కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) నివేదిక ప్రకారం, 2020లో కుక్కకాటు కారణంగా ముగ్గురు వ్యక్తులు మరణించారని… 2022లో ఈ సంఖ్య రెండు రెట్లు పెరిగిందని తెలిపింది. 2023లో వసంత్ కుంజ్ ప్రాంతంలో ఒక నెలలో ఆరుగురు వ్య‌క్తులు కుక్క‌ల దాడికి గురైన‌ట్లు నివేదిక‌లు పేర్కొన్నాయి.

Exit mobile version