Asani Cyclone: ఏపీకి హై అలర్ట్.. డేంజర్ జోన్లో ఆ జిల్లాలు!

అసని తుఫాన్ (Asani Cyclone) ఊహించని ట్విస్టులిస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Rain

Rain

అసని తుఫాన్ (Asani Cyclone) ఊహించని ట్విస్టులిస్తోంది. టెక్నాలజీకి కూడా అందకుండా దిశలు మారుస్తోంది. తొలుత ఉత్తరాంధ్ర వైపు పయనించి ఒడిసా దిశగా సాగుతుందని అంతా భావించినా.. తుఫాన్ గమనం ఉన్నట్లుండి కృష్ణా జిల్లా (Krishna District) మచిలీపట్నం వైపు మళ్లింది. అసని తుఫాన్ (Asani Cyclone) ఊహించని ట్విస్టులిస్తోంది. టెక్నాలజీకి కూడా అందకుండా దిశలు మారుస్తోంది. తొలుత ఉత్తరాంధ్ర వైపు పయనించి ఒడిసా దిశగా సాగుతుందని అంతా భావించినా.. తుఫాన్ గమనం ఉన్నట్లుండి కృష్ణా జిల్లా (Krishna District) మచిలీపట్నం వైపు మళ్లింది.

ప్రస్తుతం తుఫాన్ మచిలీపట్నం-బాపట్ల తీరాల మధ్య కేంద్రీకృతమైంది. ప్రస్తుతం మచిలీపట్నంకు సమీపిస్తున్న తుఫాన్.. మంగళవారం మధ్యాహ్నం తుఫాన్ బాపట్ల తీరాన్ని సమీపించడంతో ఒంగోలు, బాపట్ల, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ఎఫెక్ట్ తో ఒంగోలు, అద్దంకి, మచిలీపట్నం, దివిసీమ ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయి. తీరప్రాంతంలో గంటకు 70 కిలోమీటర్ల వరకు తుఫాన్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉండే అవకాశముండటంతో 10 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ, రేపు ఉమ్మడి కృష్ణ, గుంటూరు. ఇక బుధ, గురువారాల్లో కృష్ణా, విజయవాడ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు పయనం..

  Last Updated: 10 May 2022, 10:56 PM IST