Site icon HashtagU Telugu

Iran Steel Factory : ఇరాన్‌లోని స్టీల్ ఫ్యాక్ట‌రీలో భారీ పేలుడు.. ఒక‌రు మృతి, ఇద్ద‌రికి గాయాలు

Iron Blast

Iron Blast

ఇరాన్‌లోని సెంట్రల్ యాజ్ద్ ప్రావిన్స్‌లోని బఫాక్ స్టీల్ కాంప్లెక్స్‌లో భారీ పేలుడు సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో ఒక‌రు మృతి చెంద‌గా.. మ‌రో ఇద్ద‌రు గాయ‌ప‌డిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. గాయపడిన ఇద్దరు వ్యక్తులను బఫాక్ నగరంలోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని ఐఆర్‌ఎన్‌ఏ తెలిపింది, అయితే యాజ్డ్ ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్ ప్రాథమిక నివేదికలో స్టీల్ కంపెనీలో వెల్డింగ్ సమయంలో పేలుడు సంభవించిందని పేర్కొంది