Site icon HashtagU Telugu

Heavy Rains : వరదల్లో రైల్వే స్టేషన్.. సిటీలోకి మొసళ్ళు.. వణికిస్తున్న వానలు

Heavy Rains

Heavy Rains

Heavy Rains : భారీ వర్షాలతో గుజరాత్‌లో  జనజీవనం అస్తవ్యస్తమైంది. ఆ రాష్ట్రంలోని కుత్బుల్లాపూర్‌లో ఉన్న గాంధీధామ్‌ రైల్వేస్టేషన్‌ వరద నీటితో నిండిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు  పడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి  బయటికి వచ్చింది. గత రెండు మూడు రోజులుగా గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా అహ్మదాబాద్, జునాగఢ్, జామ్‌నగర్‌లలోని  రోడ్లపై నీరు(Heavy Rains)  నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరింది. అహ్మదాబాద్- ముంబై జాతీయ రహదారిపై నీటి ఎద్దడి నెలకొంది.

33 జిల్లాల్లో వర్షాలు

రాష్ట్రంలోని సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌ ప్రాంతాల్లోని నదులన్నీ ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. గత 24 గంటల్లో నవ్‌సారిలో 25 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గుజరాత్‌లోని మొత్తం 33 జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. గుజరాత్‌లో మరో ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.  జామ్‌నగర్‌లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. జునాగఢ్‌లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.

Also read : Space Solar Stations : స్పేస్ లో సోలార్ పవర్ స్టేషన్స్.. ఇలా పని చేస్తాయి..

వడోదర వరద నీటిలో మొసళ్లు

వడోదరలో వరద నీటిలో మొసళ్లు కొట్టుకొని వచ్చాయి. జూన్ 30న రాత్రి  వడోదరలోని భాయిలీ ప్రాంతంలో రోడ్డుపై 10 అడుగుల పొడవున్న మొసలి కనిపించింది. దాన్ని చూడగానే స్థానికులు అటవీ శాఖాధికారుల అందించారు. వెంటనే అటవీశాఖ రెస్క్యూ టీమ్ వచ్చి వాటిని పట్టుకొని వెళ్ళింది.

వరద మధ్యలో 25 ట్రక్కులు.. 

బీహార్‌లోని ససారం టౌన్ భారీ వర్షాలతో జలమయమైంది. ససారం ప్రభుత్వ ఆసుపత్రి, ఆవరణ అంతా వరద గుప్పిట్లో చిక్కుకుంది. ససారమ్‌ లోని  సోన్‌ నదిలో 25కు పైగా ట్రక్కులు నది మధ్యలో నిలిచిపోయాయి. ఇసుక తవ్వకాల కోసం లారీలన్నీ నదిలోకి వెళ్లగా..  ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో లారీలన్నీ ఎక్కడికక్కడే  నిలిచిపోయాయి.