Hyderabad : నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు డాక్ట‌ర్ల‌పై మెడిక‌ల్ కౌన్సిల్ వేటు

హైద‌రాబాద్‌లో ఇద్ద‌రు డాక్ట‌ర్ల రిజిస్ట్రేష‌న్ల‌ను తెలంగాణ రాష్ట్ర వైద్య మండ‌లి స‌స్పెండ్ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

  • Written By:
  • Publish Date - April 15, 2023 / 07:32 AM IST

హైద‌రాబాద్‌లో ఇద్ద‌రు డాక్ట‌ర్ల రిజిస్ట్రేష‌న్ల‌ను తెలంగాణ రాష్ట్ర వైద్య మండ‌లి స‌స్పెండ్ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. నిర్లక్ష్యంగా వ్య‌వ‌హ‌రించినందుకు వారిపై వేటు ప‌డింది. ఏప్రిల్ 12 న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఓ రోగికి శ‌స్త్ర చికిత్స చేయాల్సి కాలుకు కాకుండా మ‌రో కాలుకి శస్త్రచికిత్స చేసినందుకు డాక్టర్ కరణ్ ఎం పటేల్ పేరును మెడికల్ రిజిస్టర్ నుండి ఆరు నెలల పాటు తొలగించారు, అయితే కేసును ఉన్నత కేంద్రానికి రిఫర్ చేయడంలో జాప్యం చేసినందుకు డాక్టర్ సిహెచ్ శ్రీకాంత్‌ను మూడు నెలల పాటు సస్పెండ్ చేశారు. . డాక్టర్ కరణ్ ఎమ్ పటేల్ రిజిస్ట‌ర్ నెంబ‌ర్ 64588ని కలిగి ఉన్నారని.. శస్త్రచికిత్స తర్వాత ఎడమ కాలుకి బదులుగా కుడి కాలుకి శస్త్రచికిత్స చేసినట్లు ఫిర్యాదు రావ‌డంతో మెడికల్ కౌన్సిల్ చ‌ర్య‌లు తీసుకుంది. 60 రోజుల్లోగా నేషనల్ మెడికల్ కమిషన్ ముందు అప్పీలు చేసుకునే హక్కు డాక్టర్లిద్దరికీ ఉందని ఉత్తర్వుల్లో పేర్కొంది.