Site icon HashtagU Telugu

India: హైదరాబాద్ లో మున్నవార్ ఫారూఖీ షో

Template (41) Copy

Template (41) Copy

స్టాండప్ కమిడియన్ మున్నవార్ ఫారూఖీ 2022 జనవరి 9న హైదరాబాద్ లో షో నిర్వహిస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఆధారాలు లేకుండా హిందువుల మనోభావాలు రెచ్చగొట్టే విధంగా ఫారూఖ్ మాట్లాడాడని బీజేపీ నేత ఆరోపణ చేయడంతో అరెస్ట్ చేశారు బెంగళూరు పోలీసులు. బెంగళూరులో మున్నావర్ ఫారూకీ షో నిర్వహణకు వ్యతిరేకంగా కొన్ని హిందూ సంఘాలు సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. కర్ణాటక ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ పేరుతో షో నిర్వహణకు అనుమతి నిరాకరించింది.

https://twitter.com/munawar0018/status/1473219099756883971

దీని పై తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ స్పందిస్తూ.. బెంగళూరు లా కాకుండా హైదరాబాద్ లో ఎవరైనా షో నిర్వహించుకోవచ్చు, హైదరాబాద్ అన్ని రకాల సంస్కృతులను గౌరవిస్తుంది అంటూ ట్వీట్ చేశారు. కాగా జనవరి 9న దందో అనే పేరుతో షోను నిర్వహించనున్నట్టు ఫారూఖీ ట్వీట్ చేశారు. షో నిర్వహించే వేదిక ఇంకా ఖరారు కాకపోయినా టికెట్స్ మాత్రం బుక్ మై షో విక్రయించుకునే వెసులుబాటు కల్పించారు.. దాని లింకును కూడా మున్నవార్ ఫారూఖీట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.

ఇటీవలే దేశ ఆర్థిక రాజధాని ముంబై లో అల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ ఆఫ్ మహారాష్ట్ర ఆధ్వర్యంలో నిర్వహించిన షో లో పాల్గొన్నారు. ప్రముఖ స్టాండప్ కమిడియన్ కమ్రను కూడా ఈ నెపంతోనే అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే కేట్ఆర్ ట్వీట్ చేశారు.