CM Stalin: గ‌వ‌ర్న‌ర్‌తో ర‌గ‌డ‌.. సీయం స్టాలిన్ అఖిల‌ప‌ప‌క్ష భేటీ

  • Written By:
  • Updated On - February 5, 2022 / 12:09 PM IST

తమిళనాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ తీసుకుంటున్న నిర్ణయాలు దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌ల‌కు తెర‌లేపుతున్న సంగ‌తి తెలిసిందే. ఇక వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే అర్హత పరీక్ష నీట్‌ను స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలో అసెంబ్లీలో నీట్ పీజీ ప‌రీక్ష‌కు వ్య‌తిరేకంగా సీఎం స్టాలిన్‌ ప్రవేశపెట్టిన తీర్మానానికి అన్నాడీఎంకేతో సహా అన్ని పార్టీలు మద్దతు తెల‌ప‌డంతో ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన సంగ‌తి తెలిసిందే.అయితే నీట్ పీజీ పరీక్షపై తమిళనాడు అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని, ఆ రాష్ట్ర‌ గవర్నర్ తిరస్కరించడం హాట్‌టాపిక్‌గా మారింది. దీంతో త‌మిళ‌నాడులో ప్ర‌భుత్వానికి గ‌వ‌ర్న‌ర్‌కు మ‌ధ్య గ్యాప్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌ధ్యంలో ఈరోజు సీయం స్టాలిన్ అఖిల‌ప‌క్ష స‌మావేశాన్ని నిర్వ‌హించ‌నున్నారు. ఈ స‌మావేశంలో ప్ర‌ధానంగా గ‌వ‌ర్న‌ర్ వైఖ‌రి పై చ‌ర్చించ‌నున్నారు. అలాగే కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌క‌టించిన బ‌డ్జెట్‌లో త‌మిళ‌నాడుకు జ‌రిగిన అన్యాయం పై అఖిల‌ప‌క్ష స‌మావేశం స్టాలిన్ చ‌ర్చించున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులకు, వివిధ పక్షాల నేతలకు స్టాలిన్ లేఖ రాశారు. అలాగే ప్ర‌భుత్వ నిర్ణ‌యాలు అమ‌లు ప‌ర్చేందుకు గ‌వ‌ర్న‌ర్ అడ్డుపుల్లు వేయ‌డం పై కూడా అఖిలప‌క్ష స‌మావేశంలో స్టాలిన్ చ‌ర్చించునున్నారు.