Site icon HashtagU Telugu

Prakasam: ఇకపై ప్రతి శనివారం ఆ స్టాఫ్ అంత సైకిల్ పై రావాల్సిందే.. కలెక్టర్ అదేశం!

Nrrgisne

Nrrgisne

రోజు రోజుకి వాతావరణ కాలుష్యం మరింత పెరిగిపోతోంది. అలాగే వాహనాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. దీంతో ఈ కాలుష్య రహిత వాతావరణం నుంచి పర్యావరణాన్ని కాపాడుకోవడానికి వినూత్నంగా ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే ఒక కలెక్టర్ కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇకపై టూ వీలర్ ఫోర్ వీలర్ లో కాకుండా కార్యాలయానికి సైకిళ్లపై రావాలి అని ఆదేశించారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా జరిగింది.

కలెక్టర్ ఆఫీసు సిబ్బంది ప్రతి శనివారం కూడా కార్యాలయానికి సైకిల్ లోనే రావాలని. కార్యాలయానికి చేరుకోవడానికి సైకిళ్లను రవాణా మార్గంగా ఉపయోగించాలి అని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ అదేశించారు. తాజాగా ప్రపంచ సైకిల్‌ దినోత్సవాన్ని పురస్కరించుకున్న ఆయన జిల్లా కలెక్టరేట్‌ నుంచి ఒంగోలులోని మినీ స్టేడియం వరకు స్టెప్‌, నెహ్రూ యువకేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన సైకిల్‌ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు సైకిల్‌ తొక్కడం వారి జీవనశైలిలో భాగం చేసుకోవాలని కోరారు.