Staff Selection Commission Jobs : స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఉద్యోగాలపై ప్రత్యేక లైవ్

2024 సంవత్సరం జాబ్ క్యాలండర్ లో భాగంగా భర్తీ చేసే సుమారు 17,727 సిజిఎల్ పోస్టులకు సంబందించి తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు అవగాహన కల్పించేందుకు టి-సాట్

  • Written By:
  • Publish Date - June 29, 2024 / 05:31 PM IST

(టి.సాట్-సాఫ్ట్ నెట్) స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో భర్తీ చేసే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఉద్యోగాలకు నిర్వహించే పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ప్రత్యేక లైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి (Venugopal Reddy) శనివారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో తెలిపారు.

2024 సంవత్సరం జాబ్ క్యాలండర్ లో భాగంగా భర్తీ చేసే సుమారు 17,727 సిజిఎల్ పోస్టులకు సంబందించి తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు అవగాహన కల్పించేందుకు టి-సాట్ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీ ఆదివారం మధ్యాహ్నాం 12 నుండి ఒంటి గంట వరకు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. అనుభవం కలిగిన బోధనా సిబ్బంది లైవ్ లో పరీక్షకు సంబందించిన సలహాలు-సూచనలు అందిస్తారన్నారు. పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు ఆదివారం జరిగే ప్రత్యేక లైవ్ లో పాల్గొని తమ సందేహాలను తీర్చుకునేందుకు 040 23556037, 040 23540726 టోల్ ఫ్రీ 1800 425 4039 ఫోన్ నెంబర్లకు కాల్ చేయాలని సూచించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఎస్.ఎస్.సి సిజిఎల్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 24వ తేదీన నోటిఫికేషన్ వెలువడగా అక్టోబర్ లో టైర్-1(ప్రిలిమ్స్), డిసెంబర్ లో టైర్-2 (మేయిన్స్) పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎస్.ఎస్.సి ప్రకటించిందన్నారు. జూన్ 30వ తేదీన లైవ్ అనంతరం జూలై ఒకటవ తేదీ ఉదయం 10 నుండి 11 గంటల వరకు గంట పాటు 122 రోజులు రికార్డెడ్ కంటెంట్ ప్రసారం చేస్తున్నట్లు సీఈవో తెలిపారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్ నెన్ అండ్ జనరల్ నాలెడ్జ్ సబ్జెక్టులపై అవగాహన ప్రసారాలుంటాయని సీఈవో వేణుగోపాల్ రెడ్డి గుర్తు చేశారు.

Read Also : Pawan Kalyan : కాకినాడ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన ..