Site icon HashtagU Telugu

Exams: తెలంగాణలో టెన్త్, ఇంటర్ పరీక్షల్లో పలు మార్పులు

తెలంగాణలో టెన్త్ క్లాస్, ఇంటర్మీడియట్ పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ విద్యాసంవత్సరం చాలా ఆలస్యంగా మొదలైంది. ఇక కరోనా కేసులు పెరుగుతుండడంతో దాని కట్టడికి ప్రభుత్వం గత కొన్ని రోజులుగా విద్యాసంస్థలకు సెలవులను ప్రకటిస్తూ వచ్చింది. దీనితో విద్యార్థులకు సిలబస్ పూర్తవలేదు. ఇందుకోసమే పరీక్షలను వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు.

కరోనా థర్డ్ వేవ్ లో ఓమిక్రాన్ రూపంలో పాజిటివ్ కేసులు పెరగడంతో వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం దాదాపు జనవరి మొత్తం సెలవులు ప్రకటించింది. దింతో విద్యార్థుల సిలబస్ పూర్తి కాలేదు. అందుకే మార్చిలో పెట్టాల్సిన పరీక్షలను మేలో పెట్టాలని నిర్ణయించారు. ప్రశ్నాపత్రాల్లో అప్షన్లు పెంచాలని, సిలబస్ తగ్గించాలనే దీనివల్ల విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించవచ్చని నిపుణులు ప్రభుత్వానికి సూచించారు.

టెన్త్, ఇంటర్ పరీక్షలను మే లో జరపాలని నిర్ణయం తీసుకున్నా, ప్రభుత్వం ఇంకా తేదీలను నిర్ణయించలేదు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం పలు చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా సిలబస్ ని 50 శాతానికి తగ్గించాలని, టెన్త్ లో ఉన్న 11 పేపర్లను 6 పేపర్లకు కుదించాలని, పరీక్ష వ్యవధిని 2 గంటల 45 నిమిషాల నుండి 3 గంటల 15 నిమిషాలకు పెంచాలని నిర్ణయం తీసుకునే అవకాశముంది.

 

Exit mobile version