SSC GD Final Result: ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ పరీక్ష ఫలితాల (SSC GD Final Result) కోసం నిరీక్షణ ఎట్టకేలకు ముగిసింది. సిఎపిఎఫ్‌లలో కానిస్టేబుల్ జిడి, అస్సాం రైఫిల్స్‌లో ఎస్‌ఎస్‌ఎఫ్, జిడి రైఫిల్‌మ్యాన్ అలాగే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పరీక్షల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు. ఈ ఫలితాలు అంతిమమైనవి. వాటిని చూడటానికి ssc.nic.inని సందర్శించవచ్చు.
తుది ఫలితాలు
ఇంతకు ముందు కూడా ఫలితాలు విడుదల చేశారు. అయితే అది కంప్యూటర్ ఆధారిత పరీక్ష, PET/PST పరీక్ష ఫలితాలు అని తెలిసిందే. ఇప్పుడు విడుదల చేసిన ఫలితాలు ఫైనల్. ఈ అభ్యర్థుల ఎంపిక ఫైనల్‌గా పరిగణించబడుతుంది. ఈ ఫలితాలలో అర్హత సాధించిన అభ్యర్థులందరి పేర్లు ఉన్నాయి మణిపూర్‌లోని 597 అభ్యర్థుల ఫలితాలు మాత్రమే ప్రకటించలేదు.
Also Read: Railway Recruitment 2023: రైల్వే శాఖలో ఉద్యోగం కోసం చూస్తున్నారా.. అయితే ఇలా అప్లై చేసేయండి..!
మునుపటి ఫలితాలు ఎప్పుడు విడుదలయ్యాయి..?
SSC కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఫలితాలు మొదట విడుదల కాగా.. మొత్తం 3,70,998 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వారు PET పరీక్షలకు హాజరు అయ్యారు. అభ్యర్థులు జూన్ 30న పీఈటీ పరీక్షకు హాజరైనప్పుడు 93,228 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. దీని తరువాత DV రౌండ్ జూలై 17 నుండి ఆగస్టు 7 వరకు జరిగింది. ఇప్పుడు మణిపూర్‌లోని 597 ఖాళీలు మినహా మిగిలిన 45,590 అభ్యర్థులకు ఫలితాలు విడుదలయ్యాయి. దీని గురించి ఏదైనా వివరాలు తెలుసుకోవాలంటే, మీరు అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన నోటీసును తనిఖీ చేయవచ్చు.
SSC GD కానిస్టేబుల్ తుది ఫలితాలు చెక్ చేయండిలా..!
– ssc.nic.inలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
– హోమ్‌పేజీలో సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPFs)లో కానిస్టేబుల్ (GD), అస్సాం రైఫిల్స్‌లో SSF, రైఫిల్‌మ్యాన్ (GD), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎగ్జామినేషన్‌లో సిపాయి, 2022 తుది ఫలితాల ప్రకటన” అని చదివే లింక్ కోసం చూడండి.
– కొత్త pdf ఫామ్ కనిపిస్తుంది.
– మీ SSC GD కానిస్టేబుల్ తుది ఫలితం 2023 స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.
– పిడిఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. భవిష్యత్తు సూచన కోసం దానిని ప్రింట్ అవుట్ తీసుకోండి.