Site icon HashtagU Telugu

SSC Exams: రేపటి నుంచి SSCపరీక్షలు షురూ..విద్యార్థులు చేయాల్సినవి ఇవే..!!

Telangana SSC Exams 2025

Telangana SSC Exams 2025

మే 23 నుంచి తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు షురూ కానున్నాయి. ఈ పరీక్షలు మే 23 నుంచి జూన్ 1 వరకు జరగుతాయి. ఈ పదో తరగతి పరీక్షకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,861 పరీక్ష కేంద్రాలను విద్యాశాఖ ఏర్పాటు చేసింది. రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.45 తర్వాత పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను అనుమతించరు. రాష్ట్రవ్యాప్తంగా 5,09,275 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు.

కాగా విద్యాశాఖ ఇప్పటికే వెబ్ సైట్లో విద్యార్థుల హాల్ టికెట్లను అందుబాటులో ఉంచింది. ప్రింటెడ్ నామినల్ రోల్స్ కూడా సంబంధిత పాఠశాలలకు పంపినట్లు స్ఫష్టం చేసింది.

విద్యార్థులు హాల్ టికెట్స్ డౌన్ లోడ్ ఏలా చేసుకోవాలంటే…
* గవర్నమెంట్ ఎగ్జామినేషన్ వెబ్ సైట్ పై క్లిక్ చేసి హాల్ టికెట్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
*వెబ్ సైట్ పై క్లిక్ చేసిన తర్వాత జిల్లాపేరు, పాఠశాల పేరు సెలక్ట్ చేసుకోవాలి. మీ పుట్టిన తేదీని కూడా ఎంటర్ చేయాలి.
*ఈ వివరాలన్ని ఎంటర్ చేసి హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

విద్యార్థుల తల్లిదండ్రులు చేయాల్సినవి…చేయకూడనివి….
*పరీక్షకు ఒకరోజు ముందే పరీక్షా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో చూడాలి.
*పరీక్ష సమయానికి గంట ముందే కేంద్రాల వద్దకు చేరుకోవాలి. ఉదయం 8.30వరకు కేంద్రాలకు చేరుకుంటే మంచిది.
*విద్యార్థులు తప్పనిసరిగా తమ వెంట అవసరమైన స్టేషనరీ తీసుకెళ్లాలి.
*హాల్ టికెట్లు తప్పా మరే పేపర్ ను తీసుకెళ్లకూడదు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్, కాలిక్యూలేటర్ , ఏదైనా ఎలక్ట్రానికి పరికరాన్ని తీసుకెళ్లకూడదు.
* ఏదైనా వివరాలు, లేదా సహాయం కోసం విద్యార్థులు వారి తల్లిదండ్రులు హెల్ప్ డెస్క్ ఫోన్ నెంబర్ 23230942లో సంప్రదించవచ్చు.