SS Rajamouli: ద‌ర్శ‌కుడు రాజమౌళి కుటుంబానికి తప్పిన ప్రమాదం..!

దర్శకుడు రాజమౌళి (SS Rajamouli) కుటుంబానికి పెను ప్రమాదం తప్పింది.

Published By: HashtagU Telugu Desk
SS Rajamouli

Rajamouli went to Thamilanadu Trip and posted about temples and food in Thamilanadu

SS Rajamouli: దర్శకుడు రాజమౌళి (SS Rajamouli) కుటుంబానికి పెను ప్రమాదం తప్పింది. సూపర్‌ హిట్‌ సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ స్క్రీనింగ్ కోసం రాజమౌళి కుటుంబసభ్యులు జపాన్‌కు వెళ్లారు. కానీ అక్కడ స్వల్ప భూకంపం వచ్చిందని ఆయన కుమారుడు కార్తికేయ తన ట్విట్టర్(X)వేదికగా తెలిపాడు. భూకంపం సమయంలో తన స్మార్ట్ వాచ్‌లో వచ్చిన వార్నింగ్‌ని ఫోటో తీసి ఆయన షేర్ చేశాడు.

SS రాజమౌళి, అతని కుటుంబం ఈరోజు మార్చి 21న జపాన్‌లో 5.3 తీవ్రతతో భూకంపాన్ని చవిచూశారు. ఆయన కుమారుడు SS కార్తికేయ, వారు క్షేమంగా ఉన్నారని, భూమి కంపిస్తున్నదని తన అధికారిక X ఖాతాలో పోస్ట్ చేశారు. అతని పోస్ట్‌ను పరిశీలిస్తే.. మేము జపాన్‌లోని ఒక హోటల్‌లోని 28వ అంతస్తులో ఉన్నాం. మార్చి 18న ‘RRR’ స్పెషల్ స్క్రీనింగ్‌కి రాజమౌళి, అతని కుటుంబం హాజరయ్యారు. రాజ‌మౌళి కుమారుడు కార్తికేయ జపాన్ వాతావరణ సంస్థ నుండి భూకంపం గురించి అత్యవసర హెచ్చరికను చూపుతున్న అతని వాచ్ ఫోటోను కూడా పంచుకున్నారు.

Also Read: Vijay Antony: వివాదంలో హీరో విజయ్ ఆంటోనీ.. మండిపడుతున్న క్రైస్తవులు?

అతని పోస్ట్‌లో ఇలా పేర్కొన్నాడు. “జపాన్‌లో ఇప్పుడే భయంకరమైన భూకంపం వచ్చింది!!! 28వ అంతస్తులో ఉన్నాం. భూమి నెమ్మ‌దిగా కదలడం ప్రారంభించింది. అది భూకంపమని గ్రహించడానికి మాకు కొంత సమయం పట్టింది. నేను భయాందోళనకు గురయ్యాను కానీ జపనీయులందరూ ఇప్పుడే వర్షం కురుస్తున్నట్లు చుట్టుపక్కల వారు చలించలేదు!! అని రాసుకొచ్చాడు. కార్తికేయ తన పోస్ట్‌పై తన తండ్రి రాజమౌళి, ‘బాహుబలి’ నిర్మాత శోబు యార్లగడ్డను ట్యాగ్ చేశాడు. కొద్ది రోజుల క్రితం రాజమౌళి తన భార్య రమా రాజమౌళితో కలిసి జపాన్‌లో ‘RRR’ ప్రత్యేక ప్రదర్శనకు హాజరయ్యారు.

We’re now on WhatsApp : Click to Join

  Last Updated: 21 Mar 2024, 10:14 AM IST