Site icon HashtagU Telugu

Srivari Mettu : శ్రీవారి మెట్ల మార్గంపై గుడ్ న్యూస్‌

Tirumala New

Tirumala New

తిరుమల తిరుప‌తి మెట్ల మార్గం మే ఒక‌టో నుంచి అందుబాటులోకి రానుంది. ఆ మేర‌కు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. గత ఏడాది నవంబర్ నెలలో కురిసిన భారీ వర్షాలకు శ్రీవారి మెట్టు మార్గం ధ్వంసమైన విష‌యం విదిత‌మే.ఆమార్గాన్ని మూసివేసిన మరమ్మతులు చేపట్టింది. ఐదు నెలల తర్వాత శ్రీవారి మెట్టు మార్గం మళ్లీ తెరుచుకోనుంది. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడేలా మరమ్మతులను పూర్తి చేసినట్టు వెల్లడించారు. ప్రస్తుతం అలిపిరి నడక మార్గం భక్తులకు అందుబాటులో ఉంది. వచ్చే నెల నుంచి శ్రీవారి మెట్టు మార్గం కూడా అందుబాటులోకి రానుంది. ఫ‌లితంగా ఇరు మార్గాల ద్వారా భక్తులు కొండపైకి చేరుకునే వెసులుబాటు లభించనుంది. మరోవైపు తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. కంపార్ట్ మెంట్లలో భక్తులను ఉంచి, సర్వదర్శనానికి అనుమతిని ఇస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం, వసతి, పాలు, తాగునీరు, అన్నప్రసాదం అందిస్తున్నామని అధికారులు తెలిపారు. కానీ, అక్క‌డ సౌక‌ర్యాల‌పై చాలా మంది భ‌క్తులు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.

Exit mobile version