Site icon HashtagU Telugu

Srisailam:శ్రీశైలం ఆల‌యంలో కోవిడ్ ఆంక్ష‌లు.. ?

Srisailam Devasthanam

Srisailam Devasthanam

క‌రోనా కేసులు పెరుగుతున్నందును శ్రీశైలం ఆల‌యంలో ఆంక్ష‌లు విధించారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం జనవరి 12 నుండి ప్రారంభం కానున్న సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో పాల్గొనే వారు వ్యాక్సిన్ స‌ర్టిఫికేట్ స‌మ‌ర్పించాల‌ని నిర్ణయించింది. ఆలయ కార్యనిర్వాహక అధికారి ఎస్. లవన్న శనివారం ఆలయ సమావేశ మందిరంలో ఏర్పాట్లను, కోవిడ్ ప్రోటోకాల్‌ను పరిశీలించారు. పిల్లలను ఆలయానికి తీసుకురావద్దని భ‌క్తుల‌కు సూచించారు. ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకున్న భక్తులను మాత్రమే అనుమతిస్తామని ఆయన తెలిపారు.