BWF World Championships: కిదాంబి శ్రీకాంత్ రజతం సాధించాడు

భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ తన అభిమానులను నిరాశపరిచారు. స్పెయిన్ లోని హుఎల్వా వేదికగా జరిగిన వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఫైనల్లో కిదాంబి శ్రీకాంత్ గెలుస్తారని తన అభిమానులు ఆశలు పెట్టుకోగా, శ్రీకాంత్ ఓటమిపాలయ్యాడు. చాంపియన్ షిప్ ను అడుగుదూరంలో చేజార్చుకున్నాడు.

Published By: HashtagU Telugu Desk
kidambi srikanth

kidambi srikanth

భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ తన అభిమానులను నిరాశపరిచారు. స్పెయిన్ లోని హుఎల్వా వేదికగా జరిగిన వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఫైనల్లో కిదాంబి శ్రీకాంత్ గెలుస్తారని తన అభిమానులు ఆశలు పెట్టుకోగా, శ్రీకాంత్ ఓటమిపాలయ్యాడు. చాంపియన్ షిప్ ను అడుగుదూరంలో చేజార్చుకున్నాడు.

హోరాహోరీగా జరిగిన మెన్స్ సింగిల్స్ ఫైనల్స్ లో సింగపూర్ షట్లర్ కిన్ యూ చేతిలో శ్రీకాంత్ ఓడిపోయారు. 15-21, 20-22 పాయింట్ల తేడాతో వరుస గేమ్ లు కోల్పోయాడు. 42 నిమిషాల పాటు హోరాహోరిగా సాగిన పోరులో శ్రీకాంత్ ను కిన్ ఓడించాడు.

దేశానికి తొలి ప్రపంచ చాంపియన్ షిప్ ను గెలవాలని శ్రీకాంత్ చాలా కష్టపడ్డాడు. అయితే ఫైనల్లో హోరాహోరిగా పోరాడిన శ్రీకాంత్ రెండో స్థానంతో సిల్వర్ మెడల్ గెలిచాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఫైనల్ చేరిన తొలి భారత పురుష షట్లర్ గా శ్రీకాంత్ చరిత్ర సృష్టించాడు.

  Last Updated: 19 Dec 2021, 11:15 PM IST